తెలంగాణ: సీఎం రేవంత్ కు ఫిట్టింగ్ పెట్టిన కేటీఆర్..సాధ్యమేనా..?

Pandrala Sravanthi
 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో  ఏకధాటిగా బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి కేసీఆర్ సీఎం గా ఉన్నారు.  ఆయన సీఎంగా ఉన్న పదేండ్లు కనీసం ప్రతిపక్షం అనే మాట కూడా లేకుండా చేశారని చెప్పవచ్చు. అయితే రాజకీయాల్లో బండ్లు ఓడలవుతాయి ఓడలు బండ్లు అవుతాయి.  ఈ విధంగానే ఏ పార్టీ అయినా సరే ఒకటి రెండు సార్లు తప్ప అంతకంటే ఎక్కువ సార్లు అధికారంలోకి ఏకధాటిగా రావడం కష్టం.  

ఆ విధంగానే రెండుసార్లు ఏకదాటిగా బీఆర్ఎస్ గెలిచింది. మూడోసారి ప్రజలు విసుగు చెంది కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొచ్చారు. దీంతో బీఆర్ఎస్ పూర్తిగా తేలిపోతుంది. కేవలం కేటీఆర్, హరీష్ రావు, సీఎం కేసీఆర్ లాంటి పెద్ద లీడర్లు బయటకు వచ్చి కాంగ్రెస్ ను విమర్శిస్తున్నారు తప్ప ఇంకా ఏ లీడర్ కూడా అంతగా యాక్టివ్ గా ఉండడం లేదు.  ఇదే తరుణంలో కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డికి  సాధ్యం కానీ మాటలను  వదులుతున్నారు. ఆయన తాజాగా   పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే సీఎం రేవంత్ రెడ్డి  30 నుంచి 40 మందితో కలిసి బీజేపీతో ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని అన్నారు. కానీ ఇది సాధ్యమేనా..ఎందుకంటే మొత్తం తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 64 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.  ఇందులో 39 బీఆర్ఎస్,ఎనిమిది బీజేపీ గెలుచుకుంది.

మరి రేవంత్ రెడ్డి 40 మందితో బిజెపిలోకి వెళ్లినా కానీ వారి ఎమ్మెల్యేలతో కలిపి మొత్తం 48 మంది అవుతారు. దీంతో ప్రభుత్వం ఏర్పడడం సాధ్యమవుతుందా.. ఇంతమంది ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఆ పార్టీలోకి మారితే మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి తప్ప  బీజేపీ ప్రభుత్వం ఏర్పడే అవకాశం అస్సలు లేదు. ఒక ఐటీ మంత్రిగా చేసినటువంటి కేటీఆర్  ఈ సత్య దూరపు ఆరోపణలు చేయడం వల్ల ఎవరికి ప్రయోజనం అని చాలామంది విమర్శిస్తున్నారు. ఒకవేళ ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే  వారితో పాటు బీఆర్ఎస్ నుంచి కూడా 20 మంది ఎమ్మెల్యేలు రావాలి మరి ఇది సాధ్యపడుతుందా..ఇలా సాధ్యం కాని విషయాలను  జనాల్లోకి స్ప్రెడ్ చేస్తే అది మరోరకంగా దారి చేసే అవకాశం ఉంది. అంత పెద్ద స్థాయిలో ఉన్న లీడర్లు ఇలాంటి మాటలు మాట్లాడడం పద్ధతి కాదని రాజకీయ విమర్శకులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మాటలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీంతో కేటీఆర్ పై  నెగిటివ్ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: