ఏపీ: నమ్మకం లేదు దొర.. వాలంటీర్లే బాబూని ఓడిస్తారా..?

Divya
సీఎం జగన్మోహన్ రెడ్డి మొదలుపెట్టిన వాటిలో వాలంటరీ వ్యవస్థ కూడా ఒకటి.. 50 ఇళ్లకు చొప్పున ఒకరిని నియమించి.. ఇంటి వద్దకే సంక్షేమ పథకాలను కూడా అందిస్తూ ఉన్నారు. అయితే ఇలాంటి వాలంటరీ వ్యవస్థ పైన గతంలో చంద్రబాబు నాయుడు చాలా నీచమైన కామెంట్స్ కూడా చేయడం జరిగింది. గోన సంచులు మోసే ఉద్యోగులు అంటూ వెటకారం చేయడమే కాకుండా మహిళలు ఒంటరిగా ఇళ్ల వద్ద ఉంటే వాలంటరీలు వెళ్లి తలుపు తడుతున్నారని .. నీచ స్థాయికి దిగజారిపోయి మరీ మాట్లాడారు. ఈ మాటలకు పవన్ కళ్యాణ్ కూడా వత్తాసు పలకడం జరిగింది.

దీంతో వాలంటరీలంతా రోడ్డు ఎక్కడమే కాకుండా దాదాపుగా 30 వేల మంది మహిళలు కూడా అదృశ్యమయ్యారని.. తనకు కేంద్ర హోంశాఖ మంత్రి తెలియజేసింది అంటూ ఏవేవో నానా మాటలు మాట్లాడి ఉన్న పరువు కాస్త పోగొట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అయితే టిడిపి, జనసేన నేతలు వాలంటరీ వ్యవస్థకి ప్రస్తుతం భయపడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఎందుకంటే ప్రధానంగా ఎన్నికలలో వాళ్లే దెబ్బేసేలా చంద్రబాబుకు కనిపిస్తూ ఉండడంతో వాలంటరీలను సైతం గాళం వేసే పనిలో భాగంగా రూ.5000 జీతాన్ని కాస్తా రూ.10వేలకు పెంచుతానంటూ ఉగాది రోజున తెలియజేశారు.

దీంతో వాలంటరీలంతా కూటమి వైపు తిరుగుతారని బాబు ఎంతో ఆశగా ఉండేవారు.. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదు.. వాలంటీర్లు రాజీనామా చేసి వైసిపి పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాలంటరీ అనే పదాన్ని పక్కనపెట్టి మరి ప్రతి ఇంటికి వెళ్లి జగన్ ప్రభుత్వంలో తాము నేరుగా చేసిన సేవలు గురించి వివరిస్తూ పలు రకాల కార్యక్రమాలను చేపడుతూ జగన్ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందంటూ  ఇంటికి వెళ్లి మరీ ప్రచారం చేస్తున్నారట. దీన్ని బట్టి చూస్తే అధికార పార్టీకి రాజకీయంగానే కాస్త అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తోంది.. ముఖ్యంగా చంద్రబాబు ఇస్తానన్న 10, 000 రూపాయల గాళం ఏమాత్రం పనిచేయలేదని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే అర్థమవుతుంది. మరి కొంతమంది నిన్ను నమ్మలేము దొర అంటూ చంద్రబాబుని కామెంట్స్ చేస్తూ ఉన్నారు.. దీన్నిబట్టి చూస్తే బాబును వాలంటరీలే ఓడించేలా కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: