ప్రశాంత్ కిశోర్ బయటపెట్టిన ఆ నేతల షాకింగ్‌ రహస్యం?

Chakravarthi Kalyan
రాజకీయ వ్యూహ కర్త ప్రశాంత్ కిశోర్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితమే. ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఈయన గురించి బాగా తెలుసు. గత ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం తన ఐప్యాక్ సంస్థ ద్వారా వ్యూహకర్తగా పనిచేశారు. ఆ ఎన్నికల్లో వైసీపీ బంపర్ మెజార్టీ సాధించడంలో తగు వ్యూహాలను రూపొందించారు. దీంతో జగన్ సీఎం అయ్యారు.

కానీ కొంతకాలంగా ఆయన ఐప్యాక్ సంస్థకు దూరంగా ఉంటున్నారు. జన్ సురాజ్ పార్టీ పెట్టి బిహార్ రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. అయితే ఆయన పలు రాష్ట్రాల్లో పలు రాజకీయ నాయకులకు వ్యూహకర్తగా పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు ప్రధాని మోదీతో కలసి పనిచేసి తన రాజకీయ ప్రస్తానాన్ని ప్రారంభించిన ఆయన స్టాలిన్,  మమతా బెనర్జీ, వైఎస్ జగన్, నితీశ్ కుమార్, కేజ్రీవాల్,  కెప్టెన్ అమరీందర్ సింగ్ వంటి నాయకులతో కలిసి పనిచేసి వారిని తన వ్యూహాలతో సీఎం చేయగలిగారు.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన దిగ్గజ రాజకీయ నాయకులను చాలా దగ్గరగా చూశారు. అయితే తాజాగా పీకే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఓ విచిత్ర ప్రశ్న ఎదురైంది.   మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన రాజకీయ నేత పేరు చెప్పండి అని అడిగారు. దానికి ఆయన చాలా ఆసక్తికర సమాధానం చెప్పారు.

నా చిన్నప్పుడు మా నాన్న ఓ మాట చెప్పారు. నీవు ఎవరిని అయినా కలిసినా.. ఎవరి దగ్గర అయినా పనిచేసినప్పుడు ప్రపంచం వారిలో ఉన్న లోపాలను చూస్తుంది. నువ్వు మాత్రం బలాలను చూడు అని చెప్పారు. నేను అదే ఫాలో అవుతున్నాను అని నర్మగర్భంగా సమాధానం ఇచ్చారు. వాస్తవానికి ప్రశాంత్ కిశోర్ చెప్పిన సమాధానం నిజ జీవితంలో అందరికీ వర్తిస్తుంది. మనం ఎవర్నీ అయినా అంచనా వేసే సమయంలో వారిలో లోపాలను మాత్రమే చూస్తాం. బలాల గురించి మర్చిపోతాం. అందుకే తమ బలాన్ని గుర్తించి వ్యూహాలు రచించేవారే విజేతలవుతారట. ఇదే ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పిన రహస్యం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: