ధోనీని అంత కోపంగా ఎప్పుడు చూడలేదు : రైనా

praveen
సాధారణంగా ఎంతో కూల్ గా కనిపించే క్రికెటర్లు ఏదో ఒక సమయంలో అగ్రేసీవ్ గా కనిపించడం చూస్తూ ఉంటాం. అయితే తన జట్టును గెలిపించాలి అనే ఉద్దేశంతో కొన్ని కొన్ని సార్లు ఏకంగా తమ బాగోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడంలో విఫలమౌతూ ఉంటారు. ఈ క్రమంలోనే కోపంతో ఊగిపోవడం జరుగుతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదానికి దిగడం కూడా చేస్తూ ఉంటారు ఎంతమంది ప్లేయర్లు.

 ఇలా ఇప్పటివరకు ప్రొఫెషనల్ క్రికెట్లో ఎంతోమంది ప్లేయర్లు ఏకంగా ప్రత్యర్తి ఆటగాళ్లతో వివాదానికి దిగిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ ఇక మిస్టర్ కూల్ అనే పదానికి మాత్రం అటు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని కేరాఫ్ అడ్రస్ గా ఉంటాడు అన్న విషయం తెలిసిందే. ఇక ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా సరే  ఎంతో కూల్ గా ఉంటాడు. తన చిరునవ్వుతోనే ప్రత్యర్ధులను భయపెడుతూ ఉంటాడు మహేంద్ర సింగ్ ధోని. తన వ్యూహాలతో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మ్యాచ్ ను తన వైపుకు తిప్పుకోగల సమర్ధుడు ధోని అనడంలో ఎలాంటి సందేహం లేదు.

 ఎప్పుడు ఎంతో కూల్ గా కనిపించే ధోని కొన్ని కొన్ని సార్లు మాత్రం కోపంతో ఊగిపోతూ ఉంటాడు. అయితే ఇదే విషయం గురించి ఇక ధోని సహచరుడు సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2014లో పంజాబ్ చేతిలో క్వాలిఫైr 2 లో ఓడినా తర్వాత ధోని చాలా కోపంగా కనిపించాడు అంటూ రైన చెప్పుకొచ్చాడు. మిస్టర్ కూల్ ని అలా ఎప్పుడూ చూడలేదు అంటూ గుర్తు చేసుకున్నాడు. 31 బంతుల్లో 42 పరుగులతో ధోని క్రీజులో ఉన్న జట్టును గెలిపించుకోకపోవడంతో డ్రెస్సింగ్ రూమ్ లోకి వచ్చి ప్యాడ్లు బ్యాట్ ని విసిరి కొట్టాడు అంటూ రైన గుర్తు చేసుకున్నాడు. కాగా ఈ మ్యాచ్లో 27 పంతులు 81 అడుగులు చేశాడు సురేష్ రైన.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: