మలయాళ సినిమాలు.. అందుకే సూపర్ సక్సెస్ అవుతున్నాయ్ : పుష్ప విలన్

praveen
ఇటీవల కాలంలో సినీ ప్రేక్షకుల పంథా పూర్తిగా మారిపోయింది. ఒకప్పటిలా కమర్షియల్ సినిమాలను ఆదరించడం ఎప్పుడో మరిచిపోయారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే సరికొత్త కథలను ఇక ఆదరించి సూపర్ సక్సెస్ లు అందించడం చేస్తున్నాము అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడైతే నాలుగు పాటలు మూడు ఫైట్లు రెండు ఎమోషన్స్ సీన్స్ ఉన్నాయి అంటే చాలు సినిమా హిట్ అవుతుంది అనుకునేవారు  ఇక సినిమాలో స్టార్ హీరో హీరోయిన్లు ఉంటే చాలు కదా బలంగా లేకపోయినా హిట్టైనా సినిమాలు చాలానే ఉన్నాయి.

 కానీ ఇప్పుడు అలా కాదు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఎంతటి స్టార్ హీరో హీరోయిన్ సినిమాలో నటించినప్పటికీ.. కథ బాలేదు అంటే సినిమాను అడర్ ప్లాప్ చేసేస్తూ ఉన్నారు ప్రేక్షకులు. ఇక వందల కోట్ల బడ్జెట్లో తెరకేక్కుతున్న సినిమాలు ప్రస్తుతం చివరికి ప్లాప్ గా మిగిలిపోతూ ఉండడం కూడా నేటి రోజుల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్యకాలంలో అటు మలయాళ సినిమాలు అక్కడి ఇండస్ట్రీలో మాత్రమే కాదు మిగతా భాషల్లో కూడా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంటూ సూపర్ హిట్ గా నిలుస్తూ ఉన్నాయ్ అన్న విషయం తెలిసిందే.

 అయితే ఇలా ఇటీవల కాలంలో మలయాళ సినిమాలు కేవలం సొంత భాషలోనే కాదు వివిధ భాషల్లో సూపర్ హిట్ కావడానికి గల కారణం ఏంటి అన్న విషయాన్ని నటుడు పహాద్ ఫాసిల్ చెప్పుకొచ్చాడు. ఈ సక్సెస్ కు కారణం భిన్నమైన కంటెంట్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చాడు. కొత్త కథలను చూసేందుకు ప్రజలు థియేటర్లకు వస్తున్నారు అంటూ ఫహద్ తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాలు చేసేందుకు ఇదే మంచి సమయం అంటూ అభిప్రాయపడ్డాడు. కాగా ఇటీవల ఫాసిల్ నటించిన ఆవేశం సినిమా థియేటర్లలో దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక తెలుగులో పుష్ప 2 అనేమూవీలో విలన్ గా నటిస్తున్నాడు ఫహాద్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: