లోకేష్: బిజెపి మాస్టర్ ప్లాన్..?

Divya
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల కాలంలో ప్రజలతో ఎక్కువగా మమేకమవుతూ మంగళగిరి నియోజకవర్గంలో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. అయితే తాజాగా నారా లోకేష్ తమిళనాడులోని ఎన్నికల ప్రచారానికి సిద్ధమయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. తమిళనాడులో బిజెపి పార్టీ తరఫున ప్రచారం చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లో టిడిపి ఎన్డియే కూటమితో కలిసి పోటీ చేయబోతున్నారు.. 2014లో కూడా ఇలా ఎన్డీయే తో చేతులు కలిపి అధికారాన్ని అందుకుంది టిడిపి. 2019లో ఎన్డీఏ నుంచి మళ్ళీ బయటికి వచ్చి పోటీ చేసి ఓడిపోయింది.

దీంతో కచ్చితంగా ఈసారి మళ్లీ గెలవాలని ఎన్డీయే తో చేతులు కలిపింది టిడిపి జనసేన.. అయితే ఎన్డియే కు అనుకూలంగా ఇతర రాష్ట్రాలలో కూడా ప్రచారం చేసేందుకు టిడిపి పార్టీ సిద్దమైనట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా తమిళనాడులోని బిజెపి పార్టీకి పెద్దగా అక్కడ బలం లేదు.. అన్న డీఎంకే డిఎంకె పార్టీల మధ్యనే ఎక్కువగా ప్రధాన పోరు కొనసాగుతూ వస్తోంది. కానీ రాష్ట్ర బీజేపీకి అన్నమలై అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత బిజెపికి కొంత బలాన్ని అయితే సంపాదించుకుంది. అందుకే ఈసారి బిజెపి మాస్టర్ ప్లాన్ వేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఈసారి లోక్సభ ఎన్నికలలో వీలైనంత సీట్లను కూడా సంపాదించాలని బిజెపి ప్రభుత్వం భావిస్తోంది. అందుకే 39 లోక్ సభ స్థానాలు ఉన్నటువంటి తమిళనాడులో కనీసం.. 20 నుంచి 30 సీట్లు గెలవాలని అందుకు తగ్గట్టుగా వ్యూహాలను రచిస్తోంది బిజెపి. తమిళనాడులో ఉండేటువంటి తెలుగు ఓటర్లను కూడా ఆకర్షించేందుకు నారా లోకేష్ ని ప్రచారం చేసేందుకు బిజెపి పార్టీ సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. కోయంబత్తూర్ లో తెలుగు వారు ఎక్కువగా ఉండడం చేత నారా లోకేష్ ద్వారా అక్కడ సభలను రోడ్డు షోలను నిర్వహిస్తే బిజెపికి కలిసొస్తుందని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి నారా లోకేష్ తమిళనాడులో ఎంట్రీ ఇస్తారా లేదా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: