ఏపీ : నాగన్న సర్వేను నమ్మని రాష్ట్ర ప్రజలు.. తెలంగాణ ఫలితాలే కారణమా?
ఏపీ ప్రజలు నాగన్న సర్వే ఫలితాలను అస్సలు నమ్మడం లేదు. తెలంగాణ విషయంలో నాగన్న సర్వే అంచనాలు పూర్తిగా తారుమారయ్యాయి. బీఆర్ఎస్ 60 నుంచి 68 స్థానాలలో కాంగ్రెస్ 33 నుంచి 40 స్థానాలలో విజయం సాధిస్తుందని ఈ సర్వే అంచనా వేయగా ఫలితాలు రివర్స్ అయ్యాయి. ఏపీలో ఫలితాలు రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పలేం కానీ చాలా జిల్లాలలో మాత్రం వైసీపీ నేతలు సైతం నమ్మలేని విధంగా సర్వే ఫలితాలు ఉన్నాయి.
ఉమ్మడి కర్నూలు జిల్లా విషయానికి వస్తే 13 స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని ఈ సర్వే లెక్కలు చెబుతున్నాయి. ఒక స్థానంలో మాత్రం టఫ్ ఫైట్ ఉంటుందని ఈ సర్వేలో వెల్లడైంది. వాస్తవంగా ఉమ్మడి కర్నూలులో 10 స్థానాలలో వైసీపీకి అనుకూలంగా ఉంటుందని 3 స్థానాలలో టీడీపీ గెలిచే ఛాన్స్ ఉందని తేలింది. ఉమ్మడి కడప జిల్లాలో 10కి 10 స్థానాలలో వైసీపీ విజయం సాధిస్తుందని ఈ సర్వే చెబుతుండగా 8 స్థానాలలో మాత్రమే వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి.
ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి ఆ సర్వే అంచనాలు నిజమయ్యే అవకాశాలు లేవని వైసీపీ నేతలే అభిప్రాయపడుతున్నారు. నాగన్న సర్వే లెక్కల్లో ఎన్నో లోపాలు ఉన్నాయని ఈ ఫలితాలు వైసీపీకి పూర్తిస్థాయిలో అనుకూలంగా ఉన్నాయని న్యూట్రల్ ఓటర్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. నాగన్న సర్వే ఫలితాలు నిజం కాకపోతే ప్రజల్లో ఈ సర్వే నిర్వాహకులు విశ్వసనీయత కోల్పోయే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.