ఏపీ: కొత్త ప్రచారంతో ఓటర్లను ఊరిస్తున్న బీజేపీ?

Chakravarthi Kalyan
నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ఎలాగైనా ఈసారి 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తోంది. అందుకు సంబంధించిన ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు.  ప్రతి ఓటు కీలకం లాగా ప్రతి సీటు ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తోంది. ప్రతి చిన్న అవకాశంతో ప్రచారం చేసుకొని లబ్ధి పొందాలని చూస్తోంది. ఏపీలో కొత్త తరహా ప్రచారానికి బీజేపీ శ్రీకారం చుట్టింది. తమ పార్టీకి చెందిన ఎంపీలను గెలిపించుకునేందుకు జనాల్లో కొత్త ఆశలను రేకేత్తిస్తోంది.

ఏపీలో బీజేపీ అధికారంలోకి రావడం ఎలాగూ కుదరదు. కూటమి గెలిస్తే టీడీపీ నుంచి చంద్రబాబు సీఎం అవుతారు. ఆయన మంత్రి వర్గంలో ఒకరిద్దరు బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు మంత్రులు అవుతారు. ఇదే సమయంలో కేంద్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ అని ఆ పార్టీ నేతలతో పాటు ప్రజలు కూడా నమ్ముతున్నారు. దీనిని అవకాశంగా మలచుకున్న బీజేపీ నేతలు.. మోదీ ప్రధాని గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఫలానా వారు కేంద్ర మంత్రి అవుతారు అంటూ హింట్ ఇస్తోంది.
ఈ విధంగా జనాల్లో రెట్టింపు ఆశలను పెంచి గెలవాలని చూస్తోంది. ఏపీలో బీజేపీకి పొత్తులో భాగంగా ఆరు ఎంపీ సీట్లు కేటాయించారు. ఇందులో ఇద్దరు సీనియర్లు ఉన్నారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, దగ్గు బాటి పురంధేశ్వరి. ఇద్దరూ ఏపీలో ప్రభావితం చేసే కీలక సామాజిక వర్గానికి చెందిన నేతలే.
బీజేపీ అధికారంలోకి వస్తే ఈ ఇద్దరూ ఏపీ నుంచి సీఎం అవుతారు అంటూ ప్రచారం చేస్తున్నారు. తద్వారా తమ ఎంపీ సీట్ల ప్రాతినిథ్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. దీనికి మరింత బలాన్ని చేకూరుస్తూ ఏపీ ఎన్నికల ఇన్ఛార్జి సిద్ధార్థనాథ్ సింగ్ సంచలన ప్రకటన చేశారు. ఎన్డీయే అధికారంలోకి వస్తే పురంధేశ్వరి కేంద్ర మంత్రి వర్గంలో ఉంటారని కామెంట్ చేశారు. దీంతో పాటు బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే కేంద్రంలో ఉంటారు కాబట్టి ఈ ప్రాంతానికి మంచి చేస్తారు అని ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ నినాదం జనాల్లోకి వెళ్తే వైసీపీకి ఇబ్బందులు తలెత్తే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

bjp

సంబంధిత వార్తలు: