టీడీపీ : తునిలో అంతుచిక్కని రాజకీయం..!

Pulgam Srinivas
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీడీపీ పార్టీలో కొన్ని ప్రాంతాలలో విభిన్నమైన వాతావరణం చోటు చేసుకుంటున్నాయి. తునిలో కూడా పరిస్థితి ప్రస్తుతం టీడీపీ పార్టీకి కాస్త వ్యతిరేకంగానే కనబడుతుంది. ఇక్కడ టీడీపీ నుండి సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు మరియు కృష్ణుడు. వీరిద్దరికీ ఇక్కడ మంచి పట్టు ఉంది. రామకృష్ణుడు ఎక్కువ శాతం రాష్ట్ర రాజకీయాల్లో చూస్తూ ఉంటే కృష్ణుడు మాత్రం సొంత నియోజకవర్గంలో ఉంటూనే ప్రజలకు చాలా దగ్గరగా ఉంటూ వస్తున్నాడు. ఒక విధంగా చెప్పాలి అంటే రామకృష్ణుడు కంటే కూడా కృష్ణుడి కే లోకల్ లో ఎక్కువ ఫాలోయింగ్ ఉంది.

2009 వ సంవత్సరం మొదటి సారి టీడీపీ పార్టీ నుండి రామకృష్ణుడు పోటీ చేశాడు. కాకపోతే ఆ పోరులో ఈయన ఓడిపోయారు. ఆ తర్వాత 2014,  2019 సంవత్సరాలలో టీడీపీ పార్టీ నుండి కృష్ణుడికి సీటు దక్కింది. అలా సైకిల్ గుర్తుతో పోటీ చేసిన ఈయన కూడా ఓడిపోయాడు. రెండు సార్లు ఓడిపోయినప్పటికీ ప్రజల్లో బాగా ఉండటంతో ఈసారి కూడా ఆయనకే సీటు వస్తుంది అని కృష్ణుడు భావించాడు. కానీ అనూహ్యంగా ఈ సారి రామకృష్ణుడి కూతురు దివ్య లైన్ లోకి వచ్చింది. దివ్య ఎంట్రీ ఇవ్వడం వరకు ఓకే కానీ ఈమె ఎప్పుడు అయితే ఈ ప్రాంత రాజకీయాల్లోకి ఎంట్రీ అయ్యిందో అప్పటి నుండి బాబాయ్ కృష్ణుడిని, అతని వర్గాన్ని దూరం పెట్టడం మొదలు పెట్టింది.

దానితో కృష్ణుడు కూడా చేసేదేమీ లేక ఇంట్లోనే ఉంటూ పార్టీకి పార్టీ పనులకు దూరంగా ఉంటున్నాడు. ఇక ఇంతకాలం పాటు తననే నమ్ముకున్న కృష్ణుడి అనుచరులు, కార్యకర్తలు దివ్య దగ్గరికి పోలేక అజ్ఞాతంలోకి వెళ్లిన లీడర్ తో ఉండలేక వైసీపీ లోకి చేరడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే లోకల్ గా మంచి క్రేజ్ ఉన్న కృష్ణుడు, దివ్యకు సపోర్ట్ ఇవ్వడం కష్టమే. మరి దివ్య బాబాయ్ సపోర్ట్ లేకుండా ఈ ప్రాంతంలో తన జెండాను ఎగరవేయడం అంతా చిన్న విషయం ఏమీ కాదు అని ఆ ప్రాంత ప్రజలు భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: