ఏపీ : సజ్జల క్లారిటీ వైసీపీకి కలిసోస్తుందా.?

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార పార్టీ వైసీపీలో అభ్యర్థులను మారుస్తున్నారంటూ జరుగుతున్నా వ్యాఖ్యలు గూర్చి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి క్లారిటీ ఇచ్చారు.నాలుగు అయిదు నెలల పాటు అభ్యర్థుల ఎంపికపై వైసీపీ కసరత్తు చేసి అభ్యర్థులను ప్రకటిస్తే మరలా అభ్యర్థులను మార్పు చేస్తున్నారంటు వస్తున్నా వార్తలపై వాస్తవం లేదని తీసిపుచ్చారు. అయితే అభ్యర్థుల మార్పు గందరగోళం అంతా టీడీపీ కూటమిలోనే ఉందని దానిని కవర్ చేసుకోవడానికి సోషల్ మీడియాలో వైసీపీపై టీడీపీ కూటమి తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. ఏదో నలుగురు వ్యక్తులు వచ్చి చేరినంత మాత్రాన వైసీపీలో అభ్యర్థుల మార్పు ఉండదని స్పష్టం చేశారు.
కొన్ని సీట్లమార్పులు చేర్పుల విషయంలో వైసీపీ హైకమాండ్ సీరియస్ గా ఆలోచిస్తోందని ఇటీవల ప్రచారం జరుగుతుంది. దాంట్లో మైలవరం నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీ నుండి పోటీ చేస్తున్నారు.వైసీపీ కుల సమీకరణాల లెక్కలు వేసుకొని చివరకు మైలవరం ఎంపీపీగా ఉన్న సర్నాల తిరుపతిరావును అభ్యర్థిగా ప్రకటించారు. కానీ మంత్రి జోగి రమేష్ విజ్ఞప్తితో ఆయనను అక్కడకు మారుస్తున్నారన్న ప్రచారం జరుగుతుంది.
అయితే మరో మంత్రి విడదల రజినీ సీటు కూడా మరోసారి మారబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. చిలకలూరిపేట నుండి గెలిచిన ఆమెను గుంటూరు వెస్ట్ కు పంపారు. ఇప్పుడు తనను గుంటూరు ఎంపీగా పోటీ చేయించే ఆలోచనలో ఉన్నారని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య తన సీటు మార్చాలని పొన్నూరు ఎమ్మెల్యే సీటు లేదా గుంటూరు పశ్చిమ సీటువ్వాలని కోరుతున్నట్లుగా చెపుతున్నారు. అలాగే  జనసేన నుండి వైసీపీలోకి వచ్చినా పోతిన మహేష్ కు విజయవాడ వెస్ట్ సీటు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలన్నింటినీ సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు.
ఒకపక్క ఎన్నికల సమయం రాబోతుంటే ఇలాంటి అవాస్తవ వార్తలు తమని ఇబ్బందికి గురించేస్తున్నాయని ఇలాంటి వాటిల్లో టీడీపీ ముందుంటుందని తమ మీద ఇలాంటి బురదలు చల్లె పని టీడీపీ తీస్కుందని ప్రజలు వీటిని నమ్మరని ఎన్నికల్లో టీడీపీకి గుణపాఠం చెప్తారని సజ్జల హెచ్చరించారు.చంద్రబాబు అధికారంలోకి వస్తే ఇప్పడు ఉన్న వాలంటీర్లను తీసివేసి కచ్చితంగా జన్మభూమి కమిటీ సభ్యులతో నింపుతారని ఆరోపించారు.అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని కూడా ఆయన గుర్తు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: