జగన్: ఓటమి భయంతో అభ్యర్థుల మార్పు..!

Divya
ఆంధ్రప్రదేశ్ లో  ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ.. అటు టిడిపి,  వైసిపి పార్టీల మధ్య భయం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నారు ఇద్దరు నేతలు.. ఇప్పుడు తాజాగా జగన్మోహన్ రెడ్డి కొన్ని సీట్లలో మార్పు చేయబోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా వినిపిస్తున్న సమాచారం ఏమిటంటే కూటమిలో ఉన్న పార్టీలకు.. ఓట్లు బదిలీ కావని.. గ్రూపులతో తమకే లాభం జరుగుతుందంటూ వైసీపీ నేతలు మొదటి నుంచి అంచనా వేసుకున్నారు.
ఎందుకంటే కూటమిలో అటు పార్టీల మధ్య,  అభ్యర్థుల మధ్య కూడా అసంతృప్తులు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ కూటమిపైన సానుకూలంగా ప్రభావం వస్తూ ఉండడంతో అటు వైసీపీలో ఇది ఒక పెద్ద కలవరంగా మారుతోంది. ముఖ్యంగా మైలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్  టిడిపి నుంచి పోటీ చేస్తున్నారు. దీంతో అక్కడ వైసీపీ నేతను సర్నాల తిరుపతిరావును ప్రకటించారు. అయితే ఇప్పుడు అక్కడ అతను గెలిచే అవకాశం లేకపోవడంతో మంత్రి జోగి రమేష్ ను దింపే విధంగా ప్లాన్ చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి.

మరొక మహిళ నేత విడుదల రజిని సీటు కూడా ఈసారి మారబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. చిలకలూరిపేట నుంచి గెలిచిన ఈమెను ఈసారి గుంటూరు వెస్ట్ కి పంపించారు. తనను గుంటూరు ఎంపీగా ఇప్పుడు పోటీ చేయించే ఆలోచనలో వైసిపి అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికీ గుంటూరు వెస్ట్ అభ్యర్థిగా కిలారి వెంకట రోశయ్యను ప్రకటించారు.
జనసేన నుంచి ఇటీవలే వైసీపీలోకి వచ్చిన పోతిన మహేష్ కు విజయవాడ సీటుని ఇవ్వబోతున్నట్లుగా ప్రచారం అయితే జరుగుతోంది.. దీంతో గుంటూరు వెస్ట్, మైలవరం, గుంటూరు ఎంపీ సీట్ల పైన ఈ రోజున జరిగే సభా సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశాలు వున్నాయి..ముఖ్యంగా ఈ సమావేశంలో అభ్యర్థులను మార్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తోందట. అలాగే కడప ఎంపీ సీటు విషయంలో కూడా అవినాష్ రెడ్డికి పోటీగా వైఎస్ షర్మిల కాంగ్రెస్ నుంచి పోటీ పడుతూ ఉండడంతో వైసీపీకి ఇబ్బందిగా మారిందని.. కేవలం ఇక్కడ అవినాష్ కు టికెట్ ఇచ్చినందు వల్లే షర్మిల పోటీ చేయబోతున్నట్లు విమర్శలు చేసింది. దీంతో అక్కడ వైయస్ అభిషేక్ రెడ్డిని రంగంలోకి దింపేలా వైసిపి పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు  సమాచారం. అయితే ఇప్పటివరకు ఈ విషయం పైన వైసిపి నాయకులు ఎవరూ కూడా  స్పందించడం లేదు. కానీ ఓటమి భయం వల్లే జగన్మోహన్ రెడ్డి ఇలా అభ్యర్థులను మారుస్తున్నారనే వార్త తెరపైకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: