అమరావతి : అతనిపై ఈసారైనా "తంగిరాల సౌమ్య" పైచేయి సాధించగలదా..?

Pulgam Srinivas
తంగిరాల సౌమ్య ... మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకరరావు కుమార్తె. తంగిరాల ప్రభాకర్ రావు 2014 సార్వత్రిక ఎన్నికల్లో నందిగామ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచాడు. ఈ గెలుపు అనంతరం ఈయన ఆకస్మికంగా మరణించారు. దానితో నందిగామ నియోజకవర్గంలో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఉప ఎన్నికల్లో భాగంగా సౌమ్య టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. ఆ ఎన్నికల్లో సమీప కాంగ్రెస్ అభ్యర్థి బోడపాటి బాబురావు పై 74,827 ఓట్ల మెజారిటీతో గెలిచింది.

ఈమె నందిగామ నియోజకవర్గ తొలి మహిళ శాసన సభ్యురాలుగా గెలిచి రికార్డు సృష్టించింది. ఇలా 2014 వ సంవత్సరం భారీ మెజారిటీతో గెలిచి నందిగామ ఏరియా నుండి మొదటి మహిళా శాసన సభ్యులుగా రికార్డు ఎక్కిన ఈమె 2019 వ సంవత్సరం టీడీపీ నుండి మరోసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసింది. 2019 అసెంబ్లీ ఎన్నికలలో ఈమె తన సమీప ప్రత్యర్థి వైఎస్సార్సీపీ అభ్యర్థి డాక్టర్ మొండితోక జగన్‌మోహనరావు పై 10881 ఓట్ల తేడాతో ఓడిపోయింది.

ఇక పోయిన ఎన్నికల్లో ఈమె ఓడిపోయినప్పటికీ ఆ ఓటమి తర్వాత కూడా ప్రజల్లోనే ఉంటూ వస్తుంది. ఇక ఈమె మరికొన్ని రోజుల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో నందిగామ నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతుంది. ఇక పోయినసారి సౌమ్య పై భారీ మెజారిటీతో గెలిచిన మొండితోక జగన్మోహన్ రెడ్డి ఇక్కడి నుండి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు. ఇక పోయినసారి వీరిద్దరి మధ్య భారీ పోరే జరిగింది.

కానీ చివరకు జగన్మోహన్ రావు, సౌమ్య పై గెలిచాడు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ ప్రాంత సెట్టింగ్ ఎమ్మెల్యే కావడంతో జగన్ మోహన్ రావు కి ఈ ఏరియా పై ఎంత పట్టు ఉందో... ఇప్పటికే తన తండ్రి, తాను కూడా ఎమ్మెల్యేగా చేసినందును సౌమ్యకు కూడా ఈ ఏరియాలో అంతే పట్టు ఉంది. దానితో వీరిద్దరిలో ఎవరు గెలుస్తారు అనే దానిపై జనాల్లో కూడా పెద్దగా క్లారిటీ లేదు. ప్రస్తుతానికైతే వీరి ఇద్దరిలో ఎవరో ఎవరో గెలిచే అవకాశాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: