షర్మిల : కనబడని.. వినబడని రాజకీయం..!

Pulgam Srinivas
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు షర్మిల గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె రాజశేఖర్ రెడ్డి మరణం అనంతరం జగన్ కి ఎంతో సపోర్టుగా నిలిచింది. ఈయన కొన్ని ఆరోపణలతో జైలుకు వెళ్లిన సమయంలో కూడా ఈమెనే ఈయనకు ఎన్నో సహాయాలను చేసింది. కానీ ఆ తర్వాత వీరిద్దరికి ఏమైందో ఏమో తెలియదు కానీ వీరి మధ్య చాలా దూరం ఏర్పడింది.

దానితో ఈమె సొంతగా ఓ పార్టీని స్థాపించి తెలంగాణ రాజకీయాల్లో తన జెండా ఎగర వేయాలి అని అనుకుంది. అందులో భాగంగా "వైయస్సార్ తెలంగాణ పార్టీ" పేరుతో 8 జూలై 2021 న హైదరాబాదులో ఓ పార్టీని స్థాపించారు. ఇక ఆ తర్వాత రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కచ్చితంగా గెలిచి తీరుతాం అని చెప్పుకొచ్చింది.

అందులో భాగంగా కొంత కాలం ఈమె తెలంగాణ ప్రజల కష్టాలను తెలుసుకుంటూ పాదయాత్రను కూడా చేసింది. కొంత కాలం పాటు తెగ హడావిడి చేసిన ఈమె ఆ తర్వాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు సైలెంట్ అయిపోయింది. ఇక ఆ తర్వాత ఏకంగా తెలంగాణలో తన పార్టీని లేకుండా చేసి మళ్లీ ఆంధ్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా ఈమె ప్రస్తుతం ఆంధ్ర కాంగ్రెస్ పార్టీ పెద్దగా పని చేస్తుంది.

ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఈమె కొన్ని రోజుల పాటు అక్కడ చురుగ్గా అనేక పనుల్లో పాల్గొంది. ఈమె తెలంగాణ రాజకీయాల్లో సక్సెస్ కాలేక పోయింది. ఆంధ్ర రాజకీయాల్లో అయిన చురుకైన పాత్రను పోషిస్తుందేమో అని చాలా మంది అనుకున్నారు. ఇక ఇటు ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ఇప్పటికే చాలా కోట్ల కాండేట్ లను సెలెక్ట్ చేసి హోరాహోరీగా ప్రచారాలు నిర్వహిస్తూ ఉంటే తెలుగుదేశం , జనసేన , బీజేపీ మూడు పొత్తుగా ఈ అసెంబ్లీ , పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాయి.

ఈ రెండు వర్గాలు కూడా ప్రస్తుతం ఆంధ్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషిస్తూ ఉంటే షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కడా కనబడడం లేదు... వినబడడం లేదు. మరి ఈమె ఆంధ్ర రాజకీయాల్లో అయిన కీలకపాత్ర పోషిస్తుందా అంటే దాని విషయంలో చాలామంది ఏమీ చెప్పలేకపోతున్నారు. అన్నపై పై చేయి సాధించాలనే ఈమె రాజకీయాల్లోకి దిగింది కానీ ఈమెకు లక్ష్యం లేదు. అందుకే ఈమె జగన్ మాధురి ఎదగలేక పోతుంది అని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: