వాలంటీర్‌ వ్యవస్థ గొప్పదనం బాబోరే చాటి చెప్పారుగా?

Chakravarthi Kalyan
రాష్ట్రంలో వాలంటీర్ విలువ ఎలాంటిదో ఇప్పుడు అందరికీ అర్థం అవుతుంది. ముఖ్యంగా వాలంటీర్ల విషయంలో నాలుగున్నరేళ్లుగా విషం చిమ్మిన టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ లు ఇప్పుడు వారికి అనుకూలంగా మాట్లాడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి నెల ఒకటో తారీఖు వచ్చే వాలంటీర్ల ద్వారా వచ్చే పింఛన్లను చంద్రబాబు తను అనుకూల వ్యక్తి ద్వారా ఈసీకి ఫిర్యాదు చేయించి నిలుపుదల చేశారు.

నేడు వృద్ధులు ఎండల్లో  నిల్చొని గంటల తరబడి క్యూలైన్లో వేచి చూసి పింఛన్లు తీసుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇంటి వద్దకే పింఛన్ అందజేయాలని టీడీపీ డిమాండ్ చేసింది. ఇదే సమయంలో రాష్ట్రంలో 1.26 లక్షల మంది సచివాలయ శాశ్వత ఉద్యోగులు ఉన్నారని.. వారితో ఇంటి వద్దే పంపిణీ చేయాలని సూచించింది. అయితే ఈ విషయంపైనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చేయాల్సింది అంతా చేసి.. ఇప్పుడు బుడి బుడి దుఃఖం తీస్తున్నారని విమర్శలు గుప్పించారు. వృద్ధురాలిపై అంత ప్రేమ ఉంటే.. ఆ పని ఎందుకు చేశారంటూ నిలదీస్తున్నారు. గతంలో చంద్రబాబు జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసినా అవి ఆశించిన ఫలితం రాలేదు. జన్మభూమి కమిటీల వల్ల ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో నష్టనివారణ చర్యలు చేపట్టిన చంద్రబాబు వీటిని రద్దు చేశారు. ఈ సమయంలో ప్రజల నుంచి ఎటువంటి స్పందన రాలేదు.

అదే ఇప్పుడు జగన్ ప్రవేశ పెట్టిన వాలంటీర్ వ్యవస్థను మూడు నెలలు ఆపు చేయిస్తే మాత్రం దీని ప్రభావం ఎన్నికలపై పడింది. దీంతో మేం అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను కొనసాగిస్తాం అని చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు చెప్పాల్సిన  పరిస్థితి ఏర్పడింది.  ఒక విధంగా చెప్పాలంటే చంద్రబాబు వల్లే వాలంటీర్ వ్యవస్థ విలువ తెలిసిందని వైసీపీ నాయకులు చెబుతున్నారు. ఆయనకు కృతజ్ఙతలు చెబుతూ పోస్టులు కూడా పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: