సిక్స్ గ్యారంటీస్‌: బాబు నెత్తీనోరూ బాదుకుంటున్నా.. ఎవరూ పట్టించుకోరేం?

Chakravarthi Kalyan
ఏపీలో జగన్ వర్సెస్ చంద్రబాబు అన్నట్లు వార్ జరుగుతోంది. ఈ సారి ఎన్నికల్లో అజెండా వేరేది లేదు. రాజకీయ సిద్ధాంతాలను చూసి ఓటు వేయడం అన్నది కూడా పోయి దశాబ్దాల కాలం అయింది. వ్యక్తి పూజగానే రాజకీయాలు నడుస్తున్నాయి. ఇక ఏపీలో చూస్తే చంద్రబాబు పాలన చూశారు. అయిదేళ్ల పాటు సీఎం జగన్ పరిపాలనను ఏపీ ప్రజలు గమనించారు.

ఈ ఇద్దరిలో ఎవరు మేలు, ఎక్కువ ప్రయోజనం ఏపీకి ఉంటుంది. ఏపీని ఎవరు ముందుకు తీసుకువెళ్తారు అనే దానిపై ఈ సారి ఓటర్లు తీర్పు చెప్తారు అనడంలో సందేహం లేదు. పార్టీల కూటమి అనేది తర్వాత సంగతి. సీఎంగా చంద్రబాబునే చూడాలని ప్రజలు కోరుకున్నప్పుడు కూటమిలో ఎవరు అభ్యర్థి అయినా ప్రజలు పట్టించుకోరు. అదే జగన్ మరోసారి సీఎం కావాలని కోరుకున్నా  ఆ వైపునకు వెళ్లి వైసీపీకి ఏకపక్షంగా ఓట్లు వేస్తారు.

గత ఎన్నికల్లో నవరత్నాలు ప్రభావం ఏపీ ఓటర్లపై గట్టిగానే  పడింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి బిడ్డగా మాట ఇస్తే తప్పడు అనే ఉద్దేశంతో ప్రజలు ఏకపక్షంగా జగన్ కు జై కొట్టారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, నిరుద్యోగ భృతి, ఆడపిల్ల పుడితే రూ.25వేలు డిపాజిట్, ఇంటికో ఉద్యోగం వంటి హామీలు ఇచ్చి వాటిని నెరవేర్చలేకపోయారు. దీంతో వారిలో అసంతృప్తి నెలకొంది. ఈ ప్రభావం ఫలితాల్లో స్పష్టంగా కనిపించింది.

కానీ జగన్ నవరత్నాలను ప్రకటించి మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ మినహా వాటన్నింటని అమలు చేశారు. ఈసారి వైసీపీకి మిన్నగా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను ప్రవేశ పెట్టారు. వీటికి భారీగానే నిధులు అవసరం అవుతాయని సీఎం జగన్ లెక్కలతో సహా వివరిస్తున్నారు. అయినా ప్రజలు సంక్షేమం వైపే మొగ్గు చూపుతారు అనడంలో సందేహం లేదు. ఇదిలా ఉండగా సీఎం జగన్ ఈ సారి మ్యానిఫెస్టోలో భారీ ఎత్తున సంక్షేమం, హామీలు ఉండవు అని.. చెప్పేవే చేస్తానని ప్రకటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: