తెలంగాణ ఆర్టీసీకి మహాలక్ష్మి పథకం దెబ్బ... ఏకంగా అంత శాతం తగ్గిన బస్ పాస్ లు..!

Pulgam Srinivas
తెలంగాణ లో కొంత కాలం క్రితమే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే . ఆ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మేము కనుక అధికారంలోకి వచ్చినట్లు అయితే రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తాము అని వాగ్దానం చేసింది . ఇక ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరగడం ... అందులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని నెలకొల్పడం జరిగింది . ఇక ప్రభుత్వాన్ని నెలకొల్పిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రం లో ఉన్న మహిళలందరికీ బస్సు ప్రయాణాన్ని ఉచితం చేసింది.

పోయిన సంవత్సరం డిసెంబర్ 9 వ తేదీ నుండి ఈ పథకం అమలులోకి వచ్చింది . ఈ పథకం అమలు లోకి వచ్చిన తర్వాత ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య భారీగా పెరిగింది . కానీ ఆర్టీసీ కి మాత్రం ఆదాయం భారీగా తగ్గినట్లు తెలుస్తుంది . మహాలక్ష్మి పథకం అమలు కంటే ముందు తెలంగాణ రాష్ట్రం లో 11 లక్షలు గా ఉన్న బస్సు ప్రయాణాలు ఈ పథకం అమలు లోకి వచ్చాక 22 లక్షలకు పెరిగింది.

తెలంగాణ రాష్ట్రంలో కరుణ కంటే ముందు 4.50 లక్షల బస్ పాసు లు ఉండేవి . కరోనా దెబ్బ తో చాలా మంది ఇండ్లకు వెళ్లిపోవడం... కొంత మంది ఉద్యోగాలు కోల్పోవడంతో ఈ సంఖ్య 3.9 కి చేరింది. ఇలా ఆర్టీసీకి కరుణ వల్లే కాస్త దెబ్బ తగిలింది అనుకుంటే మహాలక్ష్మి పథకం వల్ల బస్సు పాసుల సంఖ్య ఏకం గా 2.82 లక్షలకు చేరింది . ఇక మహాలక్ష్మి పథకం వల్ల తెలంగాణ రాష్ట్ర ఆడపడుచులకు బాగానే న్యాయం జరుగుతున్నప్పటికీ మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీకి మాత్రం భారీగానే నష్టం జరుగుతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: