అతని వయస్సు 92 ఏళ్ళు.. కానీ తొలిసారి ఓటు వేయబోతున్నాడు?

praveen
ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఉండే హడావిడి అంతా ఇంతా కాదు. ఒకవైపు అన్ని పార్టీల అభ్యర్థులందరూ కూడా ప్రచారంలో బరిలోకి దిగి ప్రజల్లోనే కనిపిస్తూ ఉంటారు. తాము ప్రజల మనిషిమీ అని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే తెగ హామీలను కురిపిస్తూ.. ఏకంగా ఓటర్ మహాశయులను ఆకట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇంకోవైపు ఓటర్లు కూడా ఈ ఎన్నికల సమయంలో తెలివిగానే వ్యవహరిస్తూ ఉంటారు. ఏ అభ్యర్థి అయితే ఇక తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాడు అని నమ్ముతారో వారికే ఓటు వేయడానికి సిద్ధమవుతూ ఉంటారు.

 సాధారణంగా మన దేశంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు సరైన వయస్సు ఏది అంటే 18 సంవత్సరాలు. 18 సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేందుకు అవకాశం ఉంటుంది. వారికి ప్రత్యేకంగా ఒక ఓటర్ కార్డును కూడా కేటాయించడం చేస్తూ ఉంటారు ఎన్నికల  అధికారులు. ఈక్రమంలోనే 18 ఏళ్ల నుంచి ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన నాయకున్ని ఎన్నుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోపోయే వ్యక్తికి 92 ఏళ్ళు. కానీ జీవితంలో మొదటిసారి ఓటు వేయబోతున్నాడు.

 అదేంటి 92 ఏళ్ల వ్యక్తి మొదటిసారి ఓటు వేయడమేంటి.. ఇదేదో విచిత్రంగా ఉంది అనుకుంటున్నారు కదా.. జార్ఖండ్ లోని 92 ఏళ్లవృద్ధుడు ఎన్నికల్లో తొలిసారి ఇలా ఓటు హక్కును వినియోగించబోతున్నాడు. సాహిబ్ గంజ్ జిల్లా మున్రో బ్లాకు పోలింగ్ బూత్ లో ఖలీల్ అన్సారీ అనే వృద్ధుడు.. తాను ఇప్పటివరకు ఎన్నికల్లో ఓటు వేయలేదని తనకు ఓటు హక్కే లేదని ఎన్నికల అధికారులకు చెప్పాడు. అయితే విషయం తెలుసుకున్న ఎన్నికల అధికారి రవికుమార్ వెంటనే అన్సారి పేరును ఓటరు జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ క్రమంలోనే జూన్ 1వ తేదీన జరగబోయే పోలింగ్లో తొలిసారి 92 ఏళ్ల వయసులో ఓటు వేయబోతున్నాడు ఖలీల్ అన్సారి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: