చంద్రబాబు, జగన్‌ వేసుకుంటున్న గెలుపు ఓటముల లెక్కలు ఇవే?

Chakravarthi Kalyan
ఏపీలో ఎన్నికల సమయం ముంచుకొస్తుంది. దీంతో రాజకీయ పార్టీలు పోటా పోటీగా తమ ప్రచార పర్వాన్ని కొనసాగిస్తున్నాయి. అయితే ఇవన్నీ వ్యక్తిగత అంశాలు దాటిపోతుండటం అసలైన రాజకీయ వైచిత్రి. ఇదంతా పక్కన పెడితే వైనాట్ 175 అని సీఎం జగన్.. వైనాట్ పులివెందుల అని చంద్రబాబు పోటాపోటీగా నినాదాలు ఇస్తూ ప్రచారంలో తమ దూకుడును ప్రదర్శిస్తున్నారు.



ఎవరికీ వారు గెలుపుపై తమ ధీమాను ప్రకటిస్తున్నా.. ఎన్ని సీట్లు వస్తాయనే విషయంపై మాత్రం ఒక అంచనాకు వచ్చేశారనే అర్థం అవుతోంది. ఏపీలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. తాజాగా టీడీపీ వేసుకుంటున్న లెక్కలు పరిశీలించనట్లయితే తమ కూటమికి 110-125 సీట్లు వస్తాయని అంచనా వేసుకుంటుంది. గతంతో పోల్చితే పవన్ తో పొత్తు తర్వాత గోదావరి జిల్లాలో తమ పార్టీకి ఆదరణ పెరిగిందని భావిస్తోంది. ఇదే సమయంలో బీజేపీతో కలిసి ముందుకు వెళ్తున్నందున పట్టణ ప్రాంతాల్లో ఓటు బ్యాంకు గణనీయంగా పెరిగినట్లు లెక్కలు వేసుకుంటుంది.



పట్టణ ప్రాంతాల్లో 24 సీట్లు గెలుస్తామని నమ్ముతోంది. ఇక రాయలసీమ విషయానికొస్తే 10-15 సీట్లు.. ఉత్తరాంధ్ర నుంచి 20-25 సీట్లు, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో 20 సీట్ల వరకు ఎక్స్పెక్ట్  చేస్తున్నారు. వైసీపీ 175 సీట్లు లక్ష్యమని చెబుతున్నా గతంతో 151 సీట్లతో పోల్చితే ఈ సారి కొన్ని తగ్గినా 120-130 వరకు వస్తాయనే నమ్మకంతో ఉన్నారు.



ఉత్తరాంధ్రలో మూడొంతులలో రెండొంతుల సీట్లు తమకే వస్తాయని ఆ పార్టీ భావిస్తోంది. గోదావరి జిల్లాల్లో సగం సీట్ల వస్తాయనే ధీమాతో ఉన్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల విషయానికొచ్చే సరికి కొన్ని సీట్లు తగ్గుతాయనే అంచనాలో ఉన్నారు. ప్రకాశం జిల్లాలో తమ ప్రభావం పెరిగే అవకాశం ఉండొచ్చు అని తాజా లెక్కలు వేసుకున్నారు. నెల్లూరు లో కొంత టీడీపీ ప్రభావం ఉన్నా.. రాయలసీమలో ఫ్యాను గాలికి తిరుగులేదని విశ్వసిస్తున్నారు. మరి ఓటర్ల మదిలో ఏముంది అనేది జూన్ రెండు న తేలబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: