టీడీపీ: బాబూ డైరెక్షన్లో చిన్నమ్మ కీలు బొమ్మేనా..?

Divya
ఏపీలో కూటమి ఏర్పడిన తర్వాత ఎక్కువగా ట్రోలింగ్ కి గురవుతున్న నేత ఎవరంటే బిజెపి అధ్యక్షురాలు పురందేశ్వరి అని చెప్పవచ్చు.. ఎందుకంటే కూటమి ఏర్పడిన తర్వాత ఈమె పైన విమర్శలు చేసేవారు ఎక్కువయ్యారు.. వైసిపి పార్టీ నేతలే కాకుండా తన సొంత పార్టీ , టిడిపి పార్టీ నేతలు కూడా చాలామంది ఈమెను సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తూ రాజకీయంగా ఇబ్బంది పెడుతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.. ఆంధ్రాలో టిడిపి, బిజెపి,  జనసేన పొత్తు కుదిరి మూడు పార్టీలు సైతం కలిసి ఎన్నికల బరిలోకి దిగుతున్నాయి.

ఈ మూడు పార్టీలు కూడా అభ్యర్థులను  ప్రకటించారు.. పురందేశ్వరి ఏపీ బీజేపీ అధ్యక్షురాలు అయినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని ముందుకు వెళుతున్నది.. అంతేకాకుండా వైసిపి పైన పలు రకాల ఆరోపణలు చేసింది.. చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో  అరెస్ట్ అయిన తర్వాత ప్రభుత్వం పైన చాలా విమర్శలు చేసింది ఈమె.. అప్పటికి పొత్తు ఖరారు కాకపోయినప్పటికీ పరోక్షంగా తన మద్దతు ఇచ్చింది పురందేశ్వరి. ఏపీలో బిజెపి పొత్తుపై పురుందేశ్వర కీలకపాత్ర అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.

పొత్తు కుదిరిన తర్వాత ఆంధ్రాలో నరేంద్ర మోడీ,  జగన్ పైన నేరుగా విమర్శలు చేయలేదు.. దీంతో కొంతమంది టీడీపీ నేతలు సైతం ఆలోచనలో పడిపోయారు.. దీంతో చంద్రబాబు పురందేశ్వరి నుంచి పని కానిచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపించాయి. దీంతో చాలామంది వైసిపి నేతలు డైరెక్టుగా విమర్శించారు.. 22 మంది అధికారులను మార్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి పురుందేశ్వరి లేఖ రాసినట్టుగా సమాచారం.. అలాగే వారిలో ఎవరిని నియమించాలనే విషయంపై కూడా ఈమె నిర్ణయం తీసుకున్నట్టు.. అయితే ఈ నిర్ణయం వెనుక చంద్రబాబు డైరెక్షన్ ఉందని సమాచారం.

ఎన్నికల సమయంలో ఇలాంటి ఫిర్యాదులు మామూలు అయినప్పటికీ టిడిపి మాటలను పెద్దగా ఎన్నికల కమిషనర్ పట్టించుకోలేదు.. దీంతో పురందేశ్వరిని ప్రయోగించినట్లుగా తెలుస్తోంది టిడిపి.. అలా వైసీపీకి అనుకూలమైన అధికారుల జాబితాను కూడా టిడిపి రూపొందించి మరీ ఆమెకు ఇచ్చినట్టుగా సమాచారం.. ఈ సమాచారాన్ని ఎన్నికల కమిషనర్ కు యధావిధిగా పంపించేసిందనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.. దీంతో ఆంధ్ర కూటమిలో పురందేశ్వరి క్వీన్ గా మారింది అంటూ వైసీపీ నేతలు ఈమెను ట్రోల్ చేస్తున్నారు.. ఒక రకంగా చెప్పాలి అంటే ఈమె ఇలా క్వీన్ గా మారడం వెనుక చంద్రబాబు హస్తము ఉందని.. ఆయన డైరెక్షన్లో ఈమె కీలు బొమ్మ అయ్యింది అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: