ఎంపీగా గెలిస్తే అభివృద్ధి ఏంటో చూపిస్తా.. అరకు ఎంపీ కొత్తపల్లి గీత కామెంట్స్!

Anilkumar
కొత్తపల్లి గీత పరిచయం అవసరం లేని పేరు ఈమె గ్రూప్ వన్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూ ఎంతో బిజీగా ఉండేవారు అయితే ప్రజలకు సేవ చేయాలి అన్న ఉద్దేశంతో ఈమె 2013 వ సంవత్సరంలో తన రాజకీయాలకు కూడా రాజీనామా చేసి ప్రజలకు సేవ చేయటం కోసమే రాజకీయాల్లోకి అడుగు పెట్టారు ఇలా 2013 వ సంవత్సరంలో వైఎస్ఆర్ సీపీలోకి అడుగుపెట్టినటువంటి కొత్తపల్లి గీత  2014 ఎన్నికలలో వైసిపి పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు.
ఇలా అధికారంలో ఉంటూ అరకు ఎంపీగా కొనసాగుతూ ఉన్నటువంటి వైయస్ జగన్మోహన్ రెడ్డితో పలు మనస్పర్శలు రావడంతో పార్టీ నుంచి బయటకు వెళ్లిపోయారు ఇలా పార్టీ నుంచి బయటకు వెళ్లినటువంటి ఈమె జన జాగృతి పార్టీనీ ఏర్పాటు చేశారు అయితే అధికారం తప్పనిసరి అని గ్రహించిన ఈమె బీజేపీలోకి వెళ్లారు. ఇలా బీజేపీలో కొనసాగుతూ ఉన్నటువంటి గీత కూటమిలో భాగంగా అరకు ఎంపీగా టికెట్ గెలుపొందారు..  గీత కూటమిలో భాగంగా అరకు ఎంపీగా టికెట్ గెలుపొందారు.. అయితే అరకు ఎంపీగా తన బాధ్యతలు చాలా ఉన్నాయని అసలు అరకులో అభివృద్ధి అంటే ఏంటో తెలియాలి అంటే తాను ఎంపీగా గెలవాలని ఎంపీగా గెలిస్తే అరకు నియోజకవర్గంలో అభివృద్ధి మొదలవుతుంది అంటూ ఈ సందర్భంగా గీతా మాట్లాడారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి గిరిజనులు అంటే అమితమైనటువంటి ప్రేమ అని తెలియజేశారు. గిరిజనుల అభివృద్ధి నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని ఈమె తెలిపారు. సాక్షాత్తు మన దేశ రాష్ట్రపతిని కూడా ఒక గిరిజన మహిళను చేసినటువంటి ఘనత మోడీ గారికి ఉందని ఈమె తెలిపారు. అరకు ఎంపీగా విద్య, వైద్యం, సొంతింటి కల, యువతను విజయ మార్గంలో నడిపించడమే నా లక్ష్యంగా పెట్టుకున్నాను అంటూ గీత చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: