పల్నాడు : జగన్ పై గిరిజనులు తీసుకున్న నిర్ణయం అదేనా ?

FARMANULLA SHAIK
పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ యానాదులు గిరిజనుల అభివృద్ధి తెలుగుదేశంతోనే సాధ్యం అని మనకు నిత్యం  అందుబాటులో ఉండే ప్రజానాయకుడు కన్నా లక్ష్మీ నారాయణ గారిని గెలిపించాలని పూనుకున్నారు.యానాదులందరూ మరియు గిరిజనులు టీడీపీకి మద్దతు ఇవ్వాలని రాష్ట్ర అధ్యక్షులు తిరువీధుల శంకర్ ప్రసాద్ వెల్లడి సత్తెనపల్లిలో మీడియా సమావేశంలో తెలిపారు.రాష్ట్రంలో ఉన్న యానాది సంఘాలన్నీ తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని యానాది హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు తిరువీధుల శంకర్ ప్రసాద్ అన్నారు. బుధవారం సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీ నారాయణ గారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో యానాదులకు ఎమ్మెల్సీ,  యానాదులకు కార్పొరేషన్ ఇస్తానని నమ్మబలికించి మోసం చేశారని.పది లక్షల జనాభా గల యానాదులను గుర్తించకుండా మైదాన ప్రాంతంలో అధిక జనాభా గల యానాదులను  ఎస్టీ కమిషన్ , శ్రీశైలం టీటీడీ లాంటి  దేవాలయాల బోర్డలలో కానీ ,ఎస్టీ కమిషన్ చైర్మన్ , ట్రై కార్ ఎమ్మెల్సీగా  కూడా యానాదులకు అవకాశం ఇవ్వకుండా అన్యాయం చేశారని.
తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ యానాది కార్పొరేషన్ ఇస్తామని యానాదులకు హామీ  ఇచ్చారన్నారు. యానాదులకు ఇచ్చిన హామీలను ఏమి అమలు చేశారో చెప్పి జగన్ మోహన్ రెడ్డి యానాదులు గిరిజనుల ఓట్లడగాలని సవాల్ చేశారు.జగన్ పాలనలో యానాదులు గిరిజనులలో సంక్షేమ పథకాలు లేక పేదరికం భారీగా పెరిగిపోయిందని జీవనోపాధి లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారని లక్షల ఇళ్లు ఇచ్చామని ప్రగల్భాలు పలుకుతున్న జగన్ మోహన్ రెడ్డికి యానాదులు గిరిజనులు ఇప్పటికీ సక్రమంగా ఇళ్ళు లేక తీవ్ర ఇబ్బందులకు పడుతుంటే కనబడటం లేదని టిడిపి అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులతో యానాదులు గిరిజనుల అభివృద్ధి జరుగుతుందని.సత్తెనపల్లిలో నీతి నిజాయితీకి మారుపేరు ప్రజాసేవ చేస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకులు కన్నా లక్ష్మీ నారాయణ గారిని ఎమ్మెల్యేగా ,ఎంపీగా విద్యావంతులు యువకుడు లావు శ్రీ కృష్ణ దేవరాయలు గారిని అఖండ మెజారిటీతో యానాదులు గిరిజనులు గెలిపించాలని పిలుపునిచ్చారు.యానాది సంఘాల అందరూ తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మద్దతు ఇవ్వాలని శంకర్ ప్రసాద్ కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: