పల్నాడు :అందుకే పార్టీని వీడనున్న 'జంగా'.....?

FARMANULLA SHAIK
జంగా కృష్ణ మూర్తి ఒక భారతీయ రాజకీయ నాయకుడు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా చేసిన రాజకీయ జ్ఞానీ.ఆయనకు తన నియోజకవర్గంలో మంచి పట్టు ఉంది.1999–2009 ఎన్నికల్లో గురజాల అసెంబ్లీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచారు.
ప్రస్తుతం అక్కడ నుండి వైసీపీ అభ్యర్థిగా కాసు మహేష్ రెడ్డి బరిలో ఉన్నారు. ఆయన టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీను పై పోరుకి సిద్ధంగా ఉన్నారు. ఆయనకు జంగా సపోర్ట్ కూడా ఉండేది.2019 ఎన్నికల్లో కాసు మహేష్ రెడ్డి కోసం ఎమ్మెల్యే సీటును కూడా త్యాగం చేశానని జంగా తెలిపారు.ప్రస్తుతం ఆయన్ను సీఎం జగన్ ఎమ్మెల్యే కోటా నుండి ఆంధ్ర ప్రదేశ్ శాసన మండలి సభ్యునిగా నిలబెట్టి మండలికి పంపారు.ప్రస్తుతం గురజాలలో ఆయన చేసిన పనీ హాట్ టాపిక్ గా మారింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి  ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి రాజీనామా చేశారు.అదే విషయాన్ని పల్నాడు జిల్లాలోని తన నియోజకవర్గం గ్రామం అయినా గామాలపాడులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చెప్పారు.

దాంట్లో భాగంగానే నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుండి పార్టీకి విధేయుడుగా పని చేశానని కాకపోతే ఈరోజు గురజాల నియోజకవర్గం లో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న కాసు మహేష్ రెడ్డి పార్టీ నాది అన్నట్టుగా ప్రవర్తిస్తున్న తీరుతో నన్ను నమ్ముకున్న ఏ ఒక్కరికి కూడా నేను న్యాయం చేయలేకపోతున్నానని స్థానిక ఎమ్మెల్యే తీరుతో నాకు తెలిసోస్తుంది అని  అన్నారు. దీని గూర్చి పార్టీ పెద్దలకి చెప్పిన వారి నుండి ఎలాంటి సమాధానం లేకపోవడంతో పార్టీని వీడుతున్నానని అయితే పార్టీని వీడడం నాకు ఎంతో బాధాకరంగా ఉందని కూడా అన్నారు. అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళ భవిష్యత్ కార్యచరణ కోసం టీడీపీలోకి వెళ్తున్నట్టు  ఆయన తెలిపారు.దాంట్లో భాగంగానే ఆయన  2024 ఏప్రిల్ 1న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు.జంగా ఇలా చేయడంతో స్థానికంగా అక్కడి ఓటర్లు మీద కూడా కొద్దిగా ప్రభావితం చేస్తుంది అనడంలో ఆశ్చర్యం లేదు అనేది అక్కడ రాజకీయనేతల విశ్లేషణ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: