తెలంగాణ : కాంగ్రెస్ పాలనలో మళ్లీ మనం ఆ స్థాయికి వెళ్లాల్సిందే... కొప్పుల ఈశ్వర్..!

Pulgam Srinivas
మరికొన్ని రోజులు రానున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మంథని నియోజకవర్గం పరిధిలోని మహా ముత్తరం , కటారం , మలహల్ రావు , మండల ముఖ్య నాయకులు , కార్యకర్తలతో సన్నాహక సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ రావు ... పుట్ట మధు పాల్గొన్నారు. అందులో భాగంగా కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ ... కొంతకాలం క్రితం జరిగిన ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులను నిరాశ, నిస్పృహకు గురిచేసాయి. దానివల్ల కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ. ఇలాంటి ఎన్నో అవరోధాలను ఎదుర్కొని తెలంగాణ తెచ్చిన ఘనత ఈ పార్టీది. ఎన్నికల ఫలితాలు జనం ఇచ్చినవి వాటిని మనం స్వాగతించాలి. తెలంగాణ రాకముందు ఎలాంటి పరిస్థితి ఉంది. కెసిఆర్ 10 సంవత్సరాల పాలన లో జనాలు ఎంతో ఆనందంగా జీవించారు. కెసిఆర్ గారు చేసిన సంక్షేమం , అభివృద్ధి దేశంలో ఏ రాష్ట్రంలో  జరగలేదు. తెలంగాణ రాకముందు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ , టీడీపీ పాలకుల పాలనలో ప్రజల అనేక ఇబ్బందులు పడ్డారు.

సాగు నీళ్లు , ఉచిత కరెంటు ఆనాటి ముఖ్య మంత్రులు తలుచుకుంటే ఇవ్వలేరా..? కానీ ఎందుకు ఇవ్వలేదు.. కెసిఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు సాధ్యమైంది. గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్న చూస్తూ ఉన్నారు తప్ప.. వాటిని ఒడిసిపట్టి వ్యవసాయానికి సాగు నీళ్లు ఇచ్చి సస్యశ్యామలం చేయాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు అనుకోలేదు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కాలేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి, నీళ్ళు ను. ఒడిసి పట్టి రైతులకు ఇచ్చింది అందించింది నిజం కాదా. కాంగ్రెస్ పార్టీ మంత్రులు ముఖ్యమంత్రి గారే స్వయంగా రైతు బంధు అడిగితే చెప్పు తీసి కొడతా అంటున్నారు. అభివృద్ధి సంక్షేమం గురించి కాంగ్రెస్ మాట్లాడకుండా కాళేశ్వరం కేసీఆర్ అంటున్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సాధించి పవర్ లోకి వచ్చినందుకు జనాలు అనేక కష్టాలను ఎదుర్కొంటున్నారు.

మళ్ళీ లోక్సభ ఎలక్షన్లు వచ్చాయి. ఇందులో కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లను సాధించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. కానీ అది వారికి సాధ్యం కాదు. ఈ సారి ప్రజలు మన వైపు ఉన్నారు. మనం కచ్చితంగా భారీ సీట్లను తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకుంటాము అని చెప్పుకొచ్చాడు. అలాగే ఒక వేళ కాంగ్రెస్ పార్టీ కనుక మనల్ని చాలా రోజులు పరిపాలించినట్లు అయితే మనం పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతాం అని కొప్పుల ఈశ్వర్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ki

సంబంధిత వార్తలు: