షర్మిల చేస్తున్న పనితో.. జగన్ కు నష్టం.. బాబుకి లాభం?

praveen
గత కొంతకాలం నుంచి వైయస్ షర్మిల తీరు హాట్ టాపిక్ అని మారిపోతుంది. ఏకంగా అన్న పార్టీని వీడి తెలంగాణలో రాజకీయ నాయకురాలు ఎదగాలనుకుంది షర్మిల. వైయస్సార్ తెలంగాణ పార్టీని స్థాపించి ప్రజల్లోకి వెళ్లేందుకు ట్రై చేసింది. కానీ అంతలోనే మళ్లీ యు టర్న్ తీసుకుని ఏపీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు పదవి చేపట్టింది. అప్పటి నుంచి అన్న జగన్ పార్టీని టార్గెట్ చేస్తూ ఇక తీవ్ర విమర్శలు చేస్తూ వస్తుంది షర్మిల.

 కాగా ఏపీ రాజకీయాల్లో షర్మిల వ్యవహారం అటు జగన్ పార్టీకి తీవ్ర నష్టం కలిగిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల వేడి కొనసాగుతోంది. ఇలాంటి సమయంలో  గత కొంతకాలం నుంచి అన్నను గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్న షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తుంది అన్న విషయంపై మాత్రం అందరిలో ఆసక్తి నెలకొంది. అయితే వైసిపి కంచుకోటగా పిలుచుకునే కడప నుంచే ఎంపీగా బరిలోకి దిగేందుకు సిద్ధమైంది షర్మిల. సొంత అన్న అయినా వైఎస్ అవినాష్ రెడ్డి పైనే పోటీకి రెడీ అయింది.  ఇలా షర్మిల కడప నుంచి పోటీ చేయడం వల్ల జగన్ పార్టీకి నష్టం తప్పదు అని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

 ఎందుకంటే షర్మిల పోటీ చేయడం వల్ల చీలేది వైసిపి ఓట్లే. వైసీపీకి పడే ప్రతి 10 ఓట్లలో దాదాపు మూడు నాలుగు ఓట్లు షర్మిలకు వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య టిడిపికి రెట్టింపు లాభం ఉంది అన్నది అర్థమవుతుంది. ఈ క్రమంలోనే కడప పార్లమెంట్ సెగ్మెంట్ విషయంలో టిడిపి కూటమి ఎంతో వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తుంది. తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఇప్పటివరకు ఒక్క సారి కూడా కడప ఎంపీ సీట్లు గెలుచుకోలేదు ఆ పార్టీ. కానీ షర్మిల కారణంగా మొదటిసారి బిజెపి ద్వారా ఆ కోరికను నెరవేర్చుకోవాలని అనుకుంటుంది. కడప ఎంపీ అభ్యర్థిగా బిజెపి నేత ఆదినారాయణ రెడ్డిని బరిలోకి దింపాలని అనుకుంటుందట. మరి వైసిపి కంచుకోటగా పిలుచుకునే కడపలో ఈసారి ఎవరు గెలుస్తారు అన్నది హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: