రాయలసీమ: అనంతపూర్ అర్బన్.. చంద్రబాబు తెలివా..? వైసీపీ గెలుపా..?

Divya
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడిని పుట్టిస్తున్న విషయం తెలిసిందే.. అందులోనూ అనంతపురం పరిస్థితి అత్యంత ఉత్కంఠ భరితంగా మారింది. ప్రస్తుతం అనంతపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అసెంబ్లీ స్థానాల్లో అనంతపురం అర్బన్, కళ్యాణ్ దుర్గం , ఉరవకొండ, తాడిపత్రి ,రాయదుర్గం, గుంతకల్లు తో పాటు శింగనమల ఎస్సీ రిజర్వుడ్ నియోజకవర్గం కూడా ఉంది. ఈ నియోజకవర్గాలలో మొత్తం 17,47,912 ఓటర్లు ఉండగా.. వారిలో మహిళలు 8,65,742 మంది ఓటర్లు , 8,81,983 మంది పురుషులు ఉన్నారు..
2024 ఎన్నికల కోసం టీడీపీ  నేతలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. ముఖ్యంగా సీనియర్ నేతలు ఈసారి తమకు పార్టీ నుంచీ టిక్కెట్ దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకోగా.. టిడిపి పార్టీ అధినేత చంద్రబాబు మాత్రం వారి ఆశలను అడియాశలు చేస్తూ.. నిరాశకు గురి చేశారు. టిడిపి ప్రకటించిన అభ్యర్థుల తుది జాబితా సీనియర్ నేతలకు ఆగ్రహాన్ని తెప్పిస్తోంది.. ఇక ఈ కోవలో అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో మంటలు చెలరేగాయి.
అనంతపురం అర్బన్ అసెంబ్లీ స్థానం నుంచి దగ్గుబాటి వెంకటేశ్వర్ ప్రసాద్ ను టిడిపి ప్రకటించగా .. మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి వర్గీయులు ఈ విషయంపై రగిలిపోతున్నారు.. రుద్రంపేట సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేయడంతో పాటు పార్టీ ప్రచార సామాగ్రిని కూడా వారు దహనం చేశారు. అంతేకాదు ఇప్పటికీ నిరసన కార్యక్రమాలు అనంతపురంలో జరుగుతూనే ఉన్నాయి.. దీంతో  రగిలిపోతున్న ప్రభాకర్ చౌదరి ని.. సన్నిహిత వర్గాలు, అభ్యర్థులు ఒత్తిడి చేయగా..ఏ పార్టీలో చేరను కానీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ ప్రభాకర్ చౌదరి నిర్ణయం తీసుకున్నారు.

అయితే ఇటీవల ప్రచార కార్యక్రమంలో భాగంగా టిడిపి అభ్యర్థి వెంకటేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ.. కచ్చితంగా ప్రభాకర్ చౌదరిని అలాగే టికెట్టు దక్కకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నాయకులందరినీ కలుపుకొని ముందుకు వెళ్లి.. ఈసారి ఎలాగైనా అనంతపూర్ అర్బన్ లో టిడిపి జెండా ఎగరేసేందుకు కష్టపడతానంటూ తెలిపారు. అలాగే ఈయన మాట్లాడుతూ..రాప్తాడు నియోజకవర్గం లో ఎంపీపీ గా కూడా పని చేశాను.. ఆ తర్వాత పంచాయతీరాజ్ చాంబర్లో ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. బెస్ట్ ఎంపీపీగా నేషనల్ లెవెల్ లో అవార్డు కూడా తీసుకున్నాను.. ఇక అక్కడ నా పనితనం చూసి టిడిపి నేత చంద్రబాబు నాయుడు టికెట్టు మంజూరు చేశారు.. అంటూ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ వెల్లడించారు. మొత్తానికి దీన్ని బట్టి చూస్తే టిడిపి నేతల అండ కూడా దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ కి లభిస్తోంది అని చెప్పవచ్చు.. ఇలా చంద్రబాబు తన తెలివితేటలను ఉపయోగించి.. అభ్యర్థులందరినీ ఏకం చేసి టిడిపి జెండాను అనంతపురం అర్బన్ లో ఎగురవేసే ప్రయత్నం చేస్తున్నారు.
మరోవైపు వైసీపీ పార్టీ తరపున అనంత వెంకట్రామిరెడ్డి టికెట్ దక్కించుకోగా గత ఎన్నికల్లో ప్రభాకర్ చౌదరి మీద 28,698 ఓట్లు తేడాతో గెలిచారు.. జనసేన పార్టీ నుంచి టిసి వరుణ్ పోటీ చేయగా 10,920 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు కూటమిలో భాగంగా.. ఇండియా హెరాల్డ్ కు తెలిసిన సమాచారం మేరకు.. గతంలో వచ్చిన టిడిపి,  జనసేన ఓట్లను లెక్కిస్తే మొత్తం మీద 70, 926 ఓట్లు వచ్చాయి.. గతంలో వచ్చిన వైసీపీ ఓట్లతో ఈ కూటమి ఓట్లను పోల్చి చూస్తే 18 వేల ఓట్ల తేడా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కూటమి పొత్తు ప్రభావం అధికార పార్టీ పైన చూపలేదన్నట్టుగా తెలుస్తోంది. 2024  కూటమిలో భాగంగా పొత్తు అనేది ప్రభావం చూపని నియోజకవర్గాలలో  అనంతపురం అర్బన్ కూడా ఒకటి అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: