ఆ సమీకరణలే కోట్లకు శాపమయ్యాయా.. మంత్రి పదవి దక్కకపోవడానికి కారణాలివే!

Reddy P Rajasekhar
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఒకరనే సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో డోన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని ఓడించి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి మంత్రి పదవి కచ్చితంగా దక్కుతుందని చాలామంది భావించినా ఆ విధంగా జరగలేదు.
 
సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి గతంలో రైల్వేశాఖ సహాయ మంత్రిగా పని చేసిన అనుభవం ఉంది. మంత్రి పదవితో పాటు ఆయన కీలక పదవులను చేపట్టి ఆ పదవులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయడం జరిగింది. కర్నూలు జిల్లాలో కోట్ల కుటుంబానికి దశాబ్దాల చరిత్ర ఉండగా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తండ్రి రెండుసార్లు ఏపీ ముఖ్యమంత్రిగా పని చేయడం జరిగింది.
 
ఉమ్మడి కర్నూలు జిల్లాలో టీడీపీ బలోపేతం కావడంలో సూర్యప్రకాశ్ రెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. సామాజిక సమీకరణల వల్లే కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి మంత్రి పదవి దక్కలేదని అంతకు మించి ప్రత్యేక కారణం లేదని తెలుస్తోంది. ఉమ్మడి కర్నూలు జిల్లా నుంచి బీసీ జనార్ధన్ రెడ్డికి మంత్రి పదవి దక్కడంతో అదే సామాజిక వర్గానికి చెందిన కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డికి బాబు న్యాయం చేయలేకపోయారని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
 
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి వయస్సు 72 సంవత్సరాలు కావడంతో వయస్సురిత్యా కూడా ఆయనకు మంత్రి పదవి దక్కలేదని వినిపిస్తోంది. అయితే భవిష్యత్తులో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి న్యాయం జరిగేలా చంద్రబాబు నుంచి ఏదైనా హామీ లభిస్తుందేమో చూడాల్సి ఉంది. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాత్రం తనకు మంత్రి పదవి దక్కలేదని బాధ పడలేదని డోన్ అభివృద్ధే తన లక్ష్యమని చెబుతున్నారని భోగట్టా. బుగ్గనపై వ్యతిరేకత కూడా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఈ ఎన్నికల్లో కలిసొచ్చిందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: