అలాంటప్పుడు విడాకులు తీసుకోవడం మంచిదే... సదా..!

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపును ఏర్పరచుకున్న నటిమని సదా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన జయం మూవీ తో వెండి తేరకు పరిచయం అయింది. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం, ఇందులో ఈమె తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు రావడం మొదలు అయింది. అందులో భాగంగా ఈమె కెరియర్ ప్రారంభంలో నటించడం చాలా సినిమాలు మంచి విజయాలు అందుకోవడంతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది.

ఇక ఆ తర్వాత ఈమె తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా ఈమె విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన అపరిచితుడు అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోవడంతో ఒక్క సారిగా ఈ నటి క్రేజ్ తెలుగు తో పాటు తమిళంలో కూడా భారీగా పెరిగిపోయింది. ఆ తర్వాత ఈమె నటించిన సినిమాలు చాలా వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ రావడంతో ఈమె క్రేజ్ మెల్లమెల్లగా తగ్గింది దానితో సదా కి అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈమె వీలు చెప్పినప్పుడల్లా కొన్ని సినిమాలలో నటిస్తున్న ఎక్కువ శాతం టీవీ షో లకు జడ్జిగా వ్యవహరించడానికి ఆసక్తిని చూపిస్తోంది.

ఇకపోతే తాజాగా ఈమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో ఈమె పెళ్లి గురించి ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజాగా సదా మాట్లాడుతూ ... తాను ప్రస్తుతం ఎంతో స్వేచ్ఛగా ఉన్నాను అని, పెళ్లి చేసుకొని దానిని వదులుకోలేను అని , ఇంతవరకు నా హృదయానికి ఎవరు దగ్గర కాలేదు. ఎవరైనా నచ్చితే అప్పుడు పెళ్లి గురించి ఆలోచిస్తాను. నేను అరెంజెడ్ మ్యారేజ్ పూర్తిగా వ్యతిరేకం , లవ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటా. భాగస్వామిని భరించడం కష్టం అనిపిస్తే విడాకులు తీసుకోవడంలో ఏ మాత్రం తప్పులేదు. ఇబ్బంది పడుతూ కాపురం చేయాల్సిన అవసరం లేదు అని పెళ్లి గురించి తన భావాలను సదా తాజా ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: