తెలంగాణ : కవిత విషయంలో ఉత్కంఠలో బీఆర్ఎస్ శ్రేణులు... వారి నుండి చుక్కెదురుకానుందా.

Pulgam Srinivas
ఢిల్లీ లిక్కర్ కేసులో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు "కే సీ ఆర్" కుమార్తె , బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవితను కొన్ని రోజుల క్రితమే ఈడి అధికారులు విచారణ చేసి అరెస్ట్ చేసిన విషయం మనకి తెలిసిందే. ప్రస్తుతం కవిత తీహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న కవిత తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని రౌజ్ అవెన్యూ కోర్టులో పిటిషన్ ను దాఖలు చేశారు.

ఈ పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఈ పిటీషన్ లో కవిత తన చిన్న కుమారుడు పరీక్షలు రాస్తున్నారని  ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో నా కుమారుడి పక్కన నేను ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంలో తనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్‌ లో కవిత పేర్కొన్నారు. ఈ పిటిషన్‌ పై రౌజ్ అవెన్యూ కోర్టు "సీ బీ ఐ" ప్రత్యేక కోర్ట్ లో సోమవారం విచారణ జరగనుంది. ఈ పిటిషన్‌ను ప్రత్యేక కోర్టు న్యాయ మూర్తి కావేరి బవేజా విచారించనున్నారు.

ఈ నేపథ్యం లో ఎమ్మెల్సీ కవిత కు బెయిల్ మంజూరు అవుతుందా.. ?లేదా.. ?అనే ఉత్కంఠ "బీ ఆర్ ఎస్" శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఇక "బీ ఆర్ ఎస్" నాయకులు , పార్టీ శ్రేణులు , కార్యకర్తలు కవితకు కచ్చితంగా బెయిల్ రావాలి అని కోరుకుంటూ ఉంటే మరోవైపు ఈడీ అధికారులు మాత్రం ఎమ్మెల్సీ కవితను బెయిల్ ఇవ్వొద్దని కోరుతున్నారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేస్ లో కవిత ప్రధాన సూత్రధారిగా ఉన్నారని , దాదాపు రూ.100 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించారు. దానితో ఆమెకు బెయిల్ ఇవ్వకుండా మరికొన్ని రోజులు రిమాండ్ లో ఉంచి విచారిస్తే ఈ స్కామ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అని దానితో ఈమెకు బెయిల్ మంజూరు చేయకూడదు అని ఇది ఈడి అధికారులు న్యాయవాది ని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: