పవన్: ఒక్కొక్కటిగా చిక్కుముళ్లు విప్పుతున్నారుగా?

Chakravarthi Kalyan
ఉత్కంఠకు తెరపడింది. మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి జనసేన అభ్యర్థిగా వల్లభనేని బాల శౌరి ఖరారయ్యారు. ఈ మేరకు జనసేన అధినేత పవన్ కల్యాన్ ప్రకటించారు. గత కొద్ది రోజులుగా నెలకొన్న సస్పెన్స్ కి పవన్ తెర దించారు. పొత్తులో భాగంగా జనసేనకు రెండు ఎంపీ స్థానాలు దక్కాయి. ఇందులో కాకినాడకు ఇప్పటికే ఉదయ్ శ్రీనివాస్ పేరును ప్రకటించారు. తాజాగా రెండో స్థానానికి అభ్యర్థిని ఖరారు చేశారు.

అయితే కొద్ది రోజుల క్రితమే బాలశౌరి జనసేనలో చేరారు.  అక్కడ టికెట్ దక్కకపోవడంతో ఆయన జనసేన తలపు తట్టారు. అయితే జనసేనలో ఎంపీ టికెట్ ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది. బాలశౌరి స్థానంలో వేరొకరకి.. టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ముఖ్యంగా నాగబాబు, వంగవీటి రాధా పేర్లు ప్రముఖంగా వినిపించాయి. మరోవైపు అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి బాల శౌరిని పంపిస్తారనే టాక్ కూడా వినిపించింది. కానీ వీటికి చెక్ పెడతూ ఆయనకు టికెట్ కన్మర్మ్ చేశారు.

కాకపోతే ఎమ్మెల్యే స్థానాల్లో మాత్రం సస్పెన్స్ ఇలానే కొనసాగుతుంది. ఇక్కడ పెండింగ్ స్థానాల్లో అభ్యర్థులను పవన్ ప్రకటించడం లేదు.  ఆస్థానాల్లో ఏమైనా మార్పులు ఉంటాయా? లేక బీజేపీకి ఇవ్వాల్సి ఉంటుందా? సీట్ల సర్దుబాటులో ప్రక్రియలోనే పెండింగ్ లో పెట్టారా ఇలా రకరకాల చర్చ నడుస్తోంది. పొత్తులో భాగంగా ఆ పార్టీకి రెండు ఎంపీ, 21 ఎమ్మెల్యే స్థానాలు దక్కాయి. రెండు ఎంపీ, 18 చోట్ల ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను పవన్ ప్రకటించారు.

విశాఖ సౌత్ నుంచి వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ పేరును కూడా పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. ఇన్నాళ్లూ  ఆయన పేరు ప్రకటించకుండా పవన్ జాప్యం వహించారు. మరోవైపు బీజేపీ సోము వీర్రాజు కోసం ఒక అసెంబ్లీ స్థానాన్ని కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో ఈ సీటును జనసేన త్యాగం చేస్తుందా అనేది చూడాలి.  అవనిగడ్డ సీటును టీడీపీ నేత మండలి బుద్ధ ప్రసాద్‌ను పార్టీలో చేర్చుకుని ఇచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: