పవన్‌ చెవిలో బాబు పువ్వు: టీడీపీ ఖాతాలోకి మరో జనసేన స్థానం?

Chakravarthi Kalyan
చంద్రబాబు మరోసారి తన చాణక్యం  ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే జనసేనకు అతి తక్కువ సీట్లు కేటాయించడంలో సక్సస్‌ అయిన చంద్రబాబు.. ఇప్పుడు ఇచ్చిన ఆ కొన్ని సీట్లలోనూ అక్కడక్కడా తన అభ్యర్థులను పెట్టుకుంటున్నారు. పేరుకు వీళ్లు జనసేన అభ్యర్థులే అయినా వారంతా చంద్రబాబు మనుషులే. అలాంటి జాబితాలో ఇప్పుడు మరో నేత చేరిపోయారు. అవనిగడ్డ నుంచి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్‌ బరిలోకి దిగనున్నట్టు ఇండియా హెరాల్డ్‌కు సమాచారం ఉంది.

మండలి బుద్ధ ప్రసాద్‌ అవనిగడ్డలో పోటీకి దిగడం ఖాయమైపోయింది. అయితే ఆయన మరి టీడీపీ నేత కదా అనుకుంటున్నారా.. అవును.. ఆయన టీడీపీ నేతే. అందుకే ఆయన ఇవాళ  పిఠాపురంలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను ఆ పార్టీలో చేరనున్నట్టు ఇండియా హెరాల్డ్‌కు సమాచారం అందింది. మండలి బుద్ధ ప్రసాద్‌ టీడీపీ నేతే అయినా  పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించారు.

ఈ అవనిగడ్డ స్థానంలో జనసేనకు మంచి అభ్యర్థి కోసం పవన్‌ కల్యాణ్‌ వెదికినా దొరికినట్టు లేదు. దీంతో ఈ అవకాశాన్ని చంద్రబాబు తనకు అనుకూలంగా మలచుకున్నట్టు కనిపిస్తోంది. మండలి బుద్ధ ప్రసాద్‌ను జనసేనలోకి వెళ్లి అక్కడ నుంచి పోటీ చేయమని సూచించినట్టు ఇండియా హెరాల్డ్‌కు సమాచారం వుంది. అవనిగడ్డ స్థానం కోసం సరైన అభ్యర్థి కోసం పవన్‌ గట్టిగా ప్రయత్నించారని..  దీని కోసం విస్తృతంగా ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ఇదే సమయంలో చక్రం తిప్పిన చంద్రబాబు మండలి బుద్ధ ప్రసాద్‌ కోసం పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడి ఒప్పించినట్టు తెలుస్తోంది. ఇక మండలి బుద్ధ ప్రసాద్‌ విషయానికి వస్తే... ఆయన  1999, 2004, 2014 ఎన్నికల్లో ఈ అవనిగడ్డ నుంచే గెలిచారు. సౌమ్యుడు, వివాదరహితుడిగా పేరున్న వ్యక్తి. స్థానిక నాయకుడిగా  బుద్ధ ప్రసాద్‌కు అవనిగడ్డ నియోజకవర్గంపై మంచి పట్టు కూడా ఉంది. దీంతో పవన్‌ కల్యాణ్‌ కూడా కన్విన్స్ అయినట్టు ఇండియా హెరాల్డ్‌కు సమాచారం అందింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: