బిఆర్ఎస్ : పాపం.. ఆయన పార్టీ మారిన విషయం మర్చిపోయినట్టున్నాడు?

praveen
పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయ్ అన్న విషయం తెలిసిందే. మొన్నటి వరకు బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో.. కీలక పదవులు చేపట్టి కేసీఆర్ కి అత్యంత ఆప్తులుగా ఉన్న నేతలు అందరూ కూడా ఇక ఇప్పుడు కారు దిగి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు అని చెప్పాలి. పార్టీలోని సీనియర్ నేతలు అందరూ కూడా ఇలా కారు పార్టీకి రామ్ రామ్ చెబుతూ ఉండడంతో గులాబీ పార్టీలో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి  అయితే లోలోపల మాత్రం ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేందుకు చర్చలు జరుపుతున్నారు అంటూ ప్రచారం కూడా జరుగుతుంది.

 పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత రేవంత్ రెడ్డి పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తితే ఇక బిఆర్ఎస్ లో ఎంత మంది ఎమ్మెల్యేలు మిగిలి ఉంటారు అన్నది కూడా ఏకంగా ఆ పార్టీ నేతలనే గుబులు పుట్టిస్తుంది అని చెప్పాలి. కడియం శ్రీహరి, కేకే లాంటి కీలక నేతలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో.. మిగతా నేతలు అందరూ కూడా అంతర్మదనం చెందుతూ ఉన్నారు  ఇలాంటి సమయంలో ఇలా పార్టీని వదిలిన వారిపై ప్రస్తుతం పార్టీలో ఉన్న నేతలు విమర్శలు చేస్తూ ఉండడం గమనార్హం.

 బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సైతం ఇదే విషయంపై ఇటీవలే మాట్లాడాడు  అన్నం తినేవారు ఎవరు పార్టీ మారరు అంటూ కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చాడు  కడియం శ్రీహరి పార్టీకి తీరని ద్రోహం చేశారని.. ఆయనకు పార్టీ ఏం తక్కువ చేసింది.. ఆయన పార్టీని నమ్మించి గొంతు కోశారు. పార్టీ మారే వారిని ప్రజలు ఛీ కొకుడుతున్నారు. పార్లమెంటు ఎన్నికల తర్వాత వారికి నిజం అర్థమవుతుంది అంటూ పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే గతంలో కౌశిక్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీ నుంచి అటు బిఆర్ఎస్ లోకి వచ్చారు. ఆయన పార్టీ మార్పు విషయంలో పెద్ద రచ్చే జరిగింది. ఇక ఇప్పుడు ఆయనే అన్నం తినేవారు ఎవరు పార్టీ మారరు అంటూ వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసి ఎంతో మంది సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Brs

సంబంధిత వార్తలు: