రాయలసీమ: చంద్రబాబు వెన్నుపోటు.. సీఎం సమక్షంలో వైసీపీలోకి సీనియర్ నేత..!

Divya
అనంతపూర్ జిల్లాలో టిడిపికి పెద్ద షాకే తగిలింది.. ఇండియా హెరాల్డ్ కు అందిన సమాచారం మేరకు కళ్యాణ్ దుర్గం టికెట్ విషయంలో టిడిపిలో విభేదాలు మొదలయ్యాయి.. ఇందులో కీలకమైన నేత టిడిపిని వీడడం జరిగింది.. గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయిన ఉమామహేశ్వర నాయుడు అక్కడ టిడిపిలో బలమైన కేడర్గా ఉన్నారు. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో అక్కడ కార్యకర్తలే ప్రధాన బలం అని కూడా చెప్పవచ్చు. ఇలాంటి క్యాడర్ లో గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ నేతల మధ్య పలు రకాల విభేదాలు కూడా ఉన్నాయట.

2019 ఎన్నికలలో కళ్యాణదుర్గం అభ్యర్థిగా మాదినేని ఉమామహేశ్వర్ నాయుడు అభ్యర్థిగా నిలబడగా.. వైసిపి నేత ఉషశ్రీ చరన్ చేతిలో ఓడారు. ఆ తర్వాత 2019లో కళ్యాణ్ దుర్గం లో టిడిపి రెండు వర్గాలుగా చీలిపోయింది. ఈ రెండు వర్గాలకు చంద్రబాబు నాయుడు చెక్ పెట్టారు.. ఇన్ని రోజులు ఇన్చార్జిగా ఉన్న ఉమామహేశ్వర నాయుడు అలాగే మాజీ ఎమ్మెల్యే ఉండం హనుమంతరావు చౌదరిని కాదని మరి ఇప్పుడు మూడో వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. ఇండియా హెరాల్డ్ కి అందిన ప్రత్యేక కథనం మేరకు అమిలినేని సురేంద్రబాబును తీసుకువచ్చి కళ్యాణ్ దుర్గం కూటమిలో అభ్యర్థిగా ప్రకటించారు..

దీంతో టీడీపీ నాయకత్వం ఒక్కసారిగా తీవ్ర మనస్థాపానికి గురైంది.. గత కొన్నేళ్లుగా టిడిపిని అంటిపెట్టుకొని ఉన్న ఉమామహేశ్వర నాయుడు ఎన్నోసార్లు అనుచరులతో సమావేశమై చర్చించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా పోటీ చేయాలనుకున్నారట.. అయితే కొన్ని కారణాల చేత పార్టీలో తనకు జరిగింది అవమానంగా ఫీలై టిడిపికి రాజీనామా చేసి.. ఈ రోజున సీఎం జగన్ సమక్షంలో  వైసిపి పార్టీలోకి చేరారు..

నిన్నటి రోజున సాయంత్రం వైసీపీ అభ్యర్థి ఎంపి తలారి రంగయ్య.. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇద్దరు కూడా ఉమామహేశ్వర నాయుడు ఇంటికి వెళ్లి మరి వైసీపీలోకిరావాలని ఆహ్వానించడంతో..ఆయన వెళ్లినట్టుగా తెలుస్తోంది.2024 ఎన్నికలలో టిడిపి ఎమ్మెల్యేగా టికెట్ ఆశించినా.. రాకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసారని ఇండియా హెరాల్డ్ కు అందిన ప్రత్యేకమైన కథనం.. ఇకపోతే వీటన్నింటినీ గమనిస్తుంటే.. ఎంతో కాలం నుంచి నమ్ముకున్న సీనియర్ నేతలకు చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడుస్తున్నారు.. అందుకే ఇప్పుడు సీఎం జగన్ ఆధ్వర్యంలో చాలామంది సీనియర్ నేతలు వైసీపీలోకి చేరుతున్నారు. మొత్తానికేటు చంద్రబాబు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల టిడిపి ఒంటరి అవుతోందనే వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: