పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిచేనా..?
ఇందులో భాగంగానే పిఠాపురం నియోజవర్గంలో ఎక్కువగా ఫోకస్ పెట్టారు.. అలాగే అక్కడ పార్టీకి అండగా ఉన్నటువంటి కొంతమంది ముఖ్య నేతలు కూడా పవన్ కళ్యాణ్ తో గతంలో తిరిగి పోటీ చేసిన స్థానంలో ఉండేటువంటి ముఖ్య నేతలను వైసీపీ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు.. అయితే పిఠాపురం నియోజవర్గం నుంచి ఇప్పటికే ముద్రగడ పద్మనాభం వైసీపీలోకి రాధ తాజాగా జనసేన పార్టీలో 2019లో అభ్యర్థిగా దిగిన సీనియర్ నేత మాకినీడు శేషు కుమారిని వైసీపీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఇలా పవన్ కళ్యాణ్ కు అండగా ఉన్న వారంతా ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు.
ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకోవడం లోనే భాగంగా వీరందరికీ పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామంటూ హామీ కూడా ఇస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇటీవలే పవన్ కళ్యాణ్ తాను పోటీ చేయబోయే నియోజవర్గం పిఠాపురం నుంచి అన్నట్లుగా ప్రకటించారు.. దీంతో పవన్ కళ్యాణ్ ఓటమి లక్ష్యంగానే అధికార పార్టీ పావులు కలుపుతోందన్నట్టుగా తెలుస్తోంది. అక్కడ ఇన్చార్జిగా ఉన్న మిథున్ రెడ్డి పూర్తిస్థాయి బాధ్యతలను వైయస్ జగన్ అప్పగించేశారు ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడ చక్రం తిప్పుతున్నారు. సూర్య ప్రకాష్ ముద్రగడ పద్మనాభం తో పాటు శేషు కుమారి వంటి ముఖ్యనేతలను పార్టీలోకి తీసుకోవడంతో ఇప్పుడు కీరోలుగా మారిపోయింది. పవన్ కళ్యాణ్ కి పోటీగా వంగా గీతాన్ని కూడా వైసిపి అభ్యర్థులు ఖరారు చేశారు. సీనియర్ పొలిటిషన్ కావడంతో ఈమె గెలుపు సాధ్యమని కూడా వైసిపి భావిస్తున్నది. మరి ఏం జరుగుతుందో చూడాలి.