బాబు టెంప్ట్‌ చేస్తున్నా.. ఎక్కడా తగ్గని జగన్..?

Chakravarthi Kalyan
దేశ వ్యాప్తంగా సార్వత్రిక సందడి కనిపిస్తుండగా.. తెలుగు రాష్ట్రం ఏపీలో మాత్రం అసెంబ్లీ వేఢీ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధం అయ్యాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా బరిలో దిగుతుండగా.. వైసీపీ సింగిల్ గా పోటీకి సిద్ధం అయ్యారు. వైనాట్ 175 అనే నినాదంతో జగన్ ముందుకు వెళ్తున్నారు.

అయితే ఇప్పుడు అందరి చూపు సంక్షేమ పథకాలపై పడింది. గత ఎన్నికల్లో జగన్ నవరత్నాలు ప్రకటించి వాటిని పక్కాగా అమలు చేశారు. అందులో మద్యపాన నిషేధం, జాబ్ క్యాలెండర్ లు అమలు కాలేదు. మిగతా హామీలను మాత్రం నెరవేర్చారు. జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల్లో అసంతృప్తి నెలకొంది. వాస్తవానికి రెండు లక్షలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు జగన్ సర్కారు కల్పించినా.. వాటిని చెప్పుకునే స్థితిలో వైసీపీ లేదు.

ఇదిలా ఉండగా.. నిన్నటి వరకు పథకాలతో 20 ఏళ్లు పాటు వెనక్కి నెట్టారని జగన్ ని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు అంతకు మించి పథకాలు ప్రకటిస్తున్నారు. ఉచిత సంక్షేమ పథకాలతో రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలో పడేశారని.. ఏపీ ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందని విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు 50 ఏళ్లకే పింఛన్, జగన్ అమలు చేస్తున్న పథకాలను రెట్టింపు చేయడంతో పాటు అందరికీ అందిస్తామని హామీ ఇస్తున్నారు.

అయితే జగన్ మాత్రం హామీల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. తాను అమలు చేసే సంక్షేమ పథకాలకు ఏటా రూ.70 వేల కోట్లు అవసరం అవుతున్నాయని.. అదే టీడీపీ  పథకాలు అమలు చేయాలంటే రూ.లక్షా యాభై వేల కోట్లు కావాలని లెక్కలతో సహా వివరిస్తున్నారు. మరోవైపు మనం కూడా సంక్షేమ పథకాలు పెంచాలని పార్టీ నాయకులు జగన్ తో చెబుతున్న సమయంలో ఇచ్చే వాటిని చెబుదామని.. అమలు కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి రావొద్దని చెప్పినట్లు సమాచారం. మనం ఇచ్చిన హామీలను 99శాతం అమలు చేశాం. ఇప్పుడు కూడా ఇచ్చే వాటిని చెబుతాం. ఆ తర్వాత ప్రజల ఇష్టం అని ఎన్నికలకు వెళ్తున్నారు అంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: