TG మొదలైంది.. ఆ నంబర్లకు కాసుల పంట?

Chakravarthi Kalyan
తెలంగాణ రవాణా శాఖ వాహనాల రిజిస్ట్రేషన్‌ నంబర్ల కోడ్‌ను TS నుంచి TG కు మార్చిన సంగతి తెలిసిందే. అసలు రాష్ట్ర విభజన సమయంలో వాహనాల కోడ్‌ను   TG గా పెట్టాల్సింది. కానీ అప్పట్లో కేసీఆర్ సర్కారు Tsను ఖరారు చేసింది. ఉద్యమ సమయంలో ఎందరో తమ వాహనాలకు స్వచ్ఛందంగా  TG అని పెట్టుకున్నారు అప్పట్లో.. దీన్ని సాకారం చేస్తూ కాంగ్రెస్ సర్కారు మళ్లీ  TG కి మార్చింది. అయితే అలా మార్చిన రోజే ఫ్యాన్సీ నంబర్లతో రవాణాశాఖకు కాసుల వర్షం కురిసింది.

TG గా మార్చిన మొదటి రోజే ఫ్యాన్సీ నంబర్లతో రవాణాశాఖకు భారీగా ఆదాయం సమకూరింది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ లోని బండ్లగూడలో TG 12 0999 ఫ్యాన్సీ నంబర్ కు రూ.1,30,009 ధర పలికింది. ఈ నంబర్ ను దాసరి వెంకటేశ్వర ప్రసాద్ దక్కించుకున్నారు.  మరో నంబర్‌ TG 12 0786 ఫ్యాన్సీ నంబర్ కు రూ. 74,786 ధర పలికింది. ఈ నంబర్ ను నజీయా సుల్తాన దక్కించుకున్నారు. మొత్తం ఈ రెండు నంబర్లకు కలిపి రిజర్వేషన్ ఫీజు, బిడ్ ధర కలుపుకుంటే రవాణాశాఖకు రూ.332,295 ఆదాయం సమకూరింది. ఆర్టీఏ వెస్ట్ జోన్ లోని ఇక టౌలీచౌక్ రవాణాశాఖ కార్యాలయంలో TG 13 0001 నంబర్ కు రూ.1,61,111 ధర పలికింది. ఈ నంబర్ ను శ్రీ లక్ష్మీ గణపతి ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ దక్కించుకుంది.

ఇక TG 13 1000 నంబర్ కు రూ.60,000ల ధర పలికింది. ఈ నంబర్ మహ్మద్ అశాన్ ఖాన్ దక్కించుకున్నారు. ఈ రెండు నంబర్లకు రిజర్వేషన్ ఫీజు, బిడ్ ధర కలుపుకుంటే రవాణాశాఖకు రూ.5,38,511 ఆదాయం సమకూరింది. సౌత్ జోన్ రవాణాశాఖ కార్యాలయంలో TG120007 నంబర్ కు రూ.44, 500లు, TG120786 నంబర్ కు రూ. 74,786లు, TG120999 నంబర్ కు రూ.1,30,009లు ఈ మూడు ఫ్యాన్సీ నంబర్లకు కలిపి రూ. 3,33,295ల ఆదాయం సమకూరింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

TG

సంబంధిత వార్తలు: