మేనిఫెస్టో సూప‌రే.. కానీ బాబు చేస్తాడంటే మాత్రం డౌటే..?

RAMAKRISHNA S.S.

- మ‌హిళ‌లు, బీసీలే టార్గెట్‌గా కూట‌మి మేనిఫోస్టో
- రైతులు, అక్వా రైతుల‌పై వ‌రాలు
- కానీ జ‌గ‌న్ చెప్పాడంటే చేస్తాడు.. బాబు చేస్తాడా అన్న‌దే సందేహం

( అమరావ‌తి - ఇండియా హెరాల్డ్ )
ఎట్ట‌కేల‌కు ఊరిస్తూ వ‌స్తోన్న కూట‌మి పార్టీలు ( టీడీపీ - జ‌న‌సేన - బీజేపీ ) మేనిఫెస్టోల మంగ‌ళ‌వారం మూడు పార్టీల నేత‌ల స‌మక్షంలో రిలీజ్ చేశారు. నిజం చెప్పాలంటే వైసీపీతో పోలిస్తే టీడీపీ మేనిఫోస్టో అదిరిపోయింది. వైసీపీ మేనిఫోస్టో రిలీజ్ అయిన వెంట‌నే మిగిలిన జ‌నాలు.. సాధార‌ణ ప్ర‌జ‌ల సంగ‌తి ఎలా ?   ఉన్నా వైసీపీ వాళ్ల ఫేస్‌లే మాడిపోయాయి. వైసీపీ వాళ్ల‌తో పాటు ఆ పార్టీ నుంచి ఎంపీ, ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా పోటీ చేస్తోన్న వారికి కూడా నీర‌సాలు వ‌చ్చేశాయి. ఈ మేనిఫోస్టోతో ఎన్నిక‌ల‌కు ఎలా ?  వెళ్లాలి ?  ఎలా గెల‌వాల‌న్న చ‌ర్చ‌లు వారిలోనే న‌డిచాయి.

క‌ట్ చేస్తే రైతులు, బీసీలు, రు. 3 వేల నిరుద్యోగ భృతి.. ఇక ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్లు క‌ట్టుకునేందుకు 3 సెంట్ల ఇళ్ల స్థ‌లాలు ఇవ‌న్నీ బాగున్నాయి.. ఇంకా చెప్పాలంటే అదిరిపోయే హామీలు .. కానీ చంద్ర‌బాబు చెప్పాడంటే చేయ‌డు అన్న‌దే ఏపీలో ఉన్న డౌట్‌. ఇది నిజం కూడా.. చంద్ర‌బాబు 2014 ఎన్నిక‌ల‌కు ముందు రుణ‌మాఫీ చేస్తాన‌ని హామీ ఇవ్వ‌డంతో కొన్ని ల‌క్ష‌ల మంది రైతులు త‌మ రుణాలు క‌ట్ట‌కుండా వ‌దిలేశారు.

క‌ట్ చేస్తే బాబు సీఎం అయ్యాక అస‌లు రుణమాఫీ అన్న ప‌దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ప‌డేశారు. చాలా మంది అప్పులు, వ‌డ్డీలు పెరిగిపోయి వాటిని క‌ట్ట‌లేక బాబు మాట‌లు న‌మ్మి పూర్తిగా మోస‌పోయారు. అయితే జ‌గ‌న్ బాబుతో పోలిస్తే ఎక్కువ హామీలు ఇచ్చి ఉండ‌క‌పోవ‌చ్చు. కానీ జ‌గ‌న్ 2019లో ఇచ్చిన న‌వ‌ర‌త్నాల హామీలు అమ‌లు చేయ‌డంతో పాటు అంత‌కంటే ఎక్కువే చేసి చూపించారు.

తాను చెప్పిన హామీల‌తో పాటు అంత‌కంటే ఎక్కువే చేశాన‌ని.. ఈ సారి మేనిఫోస్టోలో త‌క్కువే చెప్పినా అంత‌కంటే ఎక్కువే చేసి చూపిస్తాన‌న్న‌ది జ‌గ‌న్ ధీమా. ఏదేమైనా జ‌గ‌న్ కంటే బాబు కూట‌మి మేనిఫెస్టో చూడ‌డానికి ఆక‌ర్ష‌ణీయంగా అయితే ఉంది. మ‌రి అమ‌లులో ఎలా ఉంటుందో ?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: