కూటమి మేనిపోస్టో: మహిళలకే పెద్దపీట..!

Divya
టిడిపి నేతలు అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన కూటమి మేనిఫెస్టో ఎట్టకేలకు విడుదల అయింది.. ఉండవల్లిలోని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు నివాసంలో ఈ మేనిఫెస్టోని సైతం విడుదల చేశారు.. పవన్ కళ్యాణ్ ,చంద్రబాబు బిజెపి ఏపీ ఎన్నికలలో కో ఇన్చార్జి సిద్ధార్థ నాథ్ సింగ్ ఈ మేనిఫెస్టోను విడుదల చేయడం జరిగింది.ముఖ్యంగా యువత మహిళల నిరుద్యోగులను లక్ష్యంగా పెట్టుకొని కూటమి ఈ మ్యానుఫస్టుని రూపొందించినట్లు సమాచారం..

మొట్టమొదటి సంతకం మెగా డీఎస్సీ పైన తెలిపారు.
అలాగే యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఐదేళ్లలోపు అంటూ తెలియజేస్తున్నారు..
అలాగే 18 ఏళ్లు నిండి ప్రతి ఆడబిడ్డ కు ఆడబిడ్డ నిధి కింద 1500 రూపాయల చొప్పున నెల చెల్లిస్తారట..
ఆర్టీసీ బస్సులో ఉచితంగా మహిళలకు ప్రయాణం.
ప్రతినెలా కూడా నిరుద్యోగులకు 3000 రూపాయలు నిరుద్యోగ భృతి.
తల్లికి వందనం కింద ఏడాదికి ఒక్కో బిడ్డకు 15వేల రూపాయలు.

అలాగే ఉచితంగా గ్యాస్ సిలిండర్లు సైతం మూడు ఏడాదికి ఫ్రీగా ఇస్తామంటూ తెలుపుతున్నారు.

మహిళల పేరు మీద రెండు సెంట్లు ఇండ్ల స్థలాన్ని కేటాయించి నాణ్యమైన ఇంటిని కూడా కట్టిస్తామంటూ తెలుపుతున్నారు.
అలాగే పెళ్లి కానుకకు లక్ష రూపాయలు చొప్పున ఇస్తారట.
చిరు వ్యాపారులకు సున్నా వడ్డీ రుణాలు..
ఫీజు రిమెంబర్స్ వంటివి పాత పద్ధతిలోనే చెల్లిస్తామంటూ తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా కరెంటు చార్జీలు సైతం పెంచబోమంటూ విదేశీ విద్య పథకాన్ని కూడా అమలు చేస్తామంటూ తెలియజేస్తున్నారు.

ముఖ్యంగా భూ హక్కు చట్టాన్ని కూడా రద్దు చేస్తామంటూ వెల్లడించారు.
అలాగే ప్రతి పండుగకు కూడా ఆ పండుగ కానుకలను కూడా ఇస్తామంటూ వెల్లడించారు.

చేనేతకు 200 యూనిట్లు వరకు ఉచితంగా మగ్గాలు ఉన్నవారికి 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఫ్రీ అంటూ తెలియజేస్తున్నారు చంద్రబాబు.
కూటమి మేనిఫెస్టోలో ఎక్కువగా మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లుగా కనిపిస్తోంది. మరి చంద్రబాబు మేనిఫెస్టో ఏ విధంగా కలిసొస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: