2019 నవరత్నాలకు మించి జగన్ మేనిఫెస్టో.. సూపర్ ప్లాన్..!!

Divya
ఆంధ్ర ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా ముందుకు వెళ్తున్నారు.. టిడిపి జనసేన బిజెపి కూటమితో బరిలోకి దిగబోతున్నారు.. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ మరొక కూటమీతో ఎన్నికల బరిలోకి దిగబోతున్నారు. సీఎం జగన్ మాత్రం తన సింగిల్గానే పోటీ చేయబోతున్నానంటూ ప్రకటించారు.. తాను చేసిన సంక్షేమం సామాజిక న్యాయంతో మరొకసారి గెలుస్తామని ధీమాతో వైసిపి పార్టీ ముందుకు వెళ్తోంది. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో గెలిస్తే అమలు చేసేటువంటి పథకాలను కూడా మ్యానిఫెస్టోలో ప్రకటించడానికి సిద్ధమయ్యారు సీఎం జగన్..

ఆంధ్రాలో సీఎం జగన్ మరొకసారి గెలవాలంటే సంక్షేమ ఓటు బ్యాంకునే ఎక్కువగా నమ్ముకుంటున్నారు.. 2019 ఎన్నికలలో గెలిచిన నవరత్నాలకు మించి ఈసారి మేనిఫెస్టో పైన చాలా కసరత్తు చేస్తూ ముందుకు వెళుతున్నారు. అందుకే మేనిఫెస్టో ఇంత లేటుగా రావడానికి కారణం అన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే ఈ మేనిపోస్టులను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది.. ఇటివలే చివరి సభ అద్దంకి సభలో సీఎం జగన్ ఈ విషయాన్ని వెల్లడించారు.. తాను చేయగలిగినవే తాను చెబుతానని చెప్పనివి కూడా చేస్తానంటూ క్లారిటీ ఇచ్చారు.

తాను అమలు చేసిన సంక్షేమాలని ఎవరు టచ్ చేయలేరని తెలియజేశారు.. చంద్రబాబు ప్రకటించిన తాజా హామీలతో పాటుగా సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలంటే చాలా ఖర్చు అవుతుందని కూడా వివరించారు.. ముఖ్యంగా ఏపీ సీఎం మేనిఫెస్టో విషయానికి వస్తే.. సంక్షేమం అభివృద్ధికి పెద్దపీట వేశాల కనిపిస్తోంది.మహిళలకు లబ్ధి చేకూర్చి నిర్ణయాలతో పాటు రైతు భరోసాను రూ .20 వేలకు పెంచే అవకాశం.. అమ్మ ఒడి ఒక పిల్ల లేదా పిల్లవాడికి అమలు చేస్తున్న వీటిని ఇద్దరు పిల్లలకు కూడా అమలు చేసే ప్రకటన.. అలాగే పెన్షన్ 3000 నుంచి 4 వేలకు పెంచి ఆలోచన.. డాక్రా మహిళలకు గతంలో ఇచ్చిన హామీ మేరకు నాలుగు.. ఇక గ్యాస్ సిలిండర్లపైన సబ్సిడీ గురించి కూడా అలాగే రైతు రుణమాఫీ ఎంత ప్రకటన చేస్తారని విషయంలో ఇంకా చర్చలు జరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: