కాపు నేత ముద్రగడ బహిరంగ లేఖ.. మళ్లీ సీఎం జగనే అంటూ...?
కానీ పవన్ స్వార్థ రాజకీయాలు అర్థం చేసుకున్న ముద్రగడ గారు ఆఖరి నిమిషంలో ఒక సరైన నిర్ణయాన్ని తీసుకున్నారు.. ముద్రగడ గారు అధికార పార్టీ వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో తమ అభిమానులకు ఒక లేఖ రాయడం జరిగింది.. కాపు ఉద్యమ నేతగా ముద్రగడ పద్మనాభం ఈనెల 14న వైఎస్సార్సీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.. ఈ నేపథ్యంలోని తాను వైసిపి పార్టీలో చేరిక పైన అభిమానులకు ఒక లేఖ రాస్తూ.. "ఈమధ్య జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మీడియా అందరి ద్వారా మీకే బాగా తెలుసు అనుకుంటున్నాను..
సీఎం జగన్ గారి పిలుపు మేరకే వైఎస్ఆర్సిపి లో వెళ్లాలని భావిస్తున్నాను మీ ఆశీస్సులతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను మరొకసారి సీఎం జగన్ గారినే ముఖ్యమంత్రిగా చూడాలని ఎలాంటి కోరికలు లేకుండా పని చేస్తానని పేదలకు మరెన్నో పథకాలు కూడా అందాలని అందుకోసం సీఎం జగన్ తో అభివృద్ధి పనులతో కలిసి పనిచేయాలని ఆశతో ఉన్నానంటూ వెల్లడించారు. మీ బిడ్డ ఆయన నేను ఎప్పుడు తప్పు చేయను చేయలేదు.. ఈనెల 14న కిర్లంపూడి నుండి తాడేపల్లి కి బయలుదేరుతున్నానని ఈ అవకాశాన్ని బట్టి నాతో ప్రయాణం కొనసాగించాలని కోరుతూ ముద్రగడ గారు లేఖ రాశారు". ఇప్పుడు ఈ లేక హాట్ టాపిక్ గా మారుతోంది. తన కుమారుడు గిరిబాబు కూడా ఇలాంటి పదవులు ఆశించకుండానే వైయస్సార్సీపీలో చేరుతామంటూ ఇటీవల వెల్లడించారు. ఈనెల 14న ఉదయం 8 నుంచి 9 గంటల మధ్యలో బయలుదేరుతామని సాయంత్రం నాలుగు నుంచి ఆరు గంటల మధ్య సీఎం సమక్షంలో వైసీపీలో చేరుతామంటూ తెలిపారు.