భారత యువకులను రష్యా మోసం చేస్తోందా?

Chakravarthi Kalyan
భారత్ లోని నిరుద్యోగులకు మాయ మాటలు చెప్పి అధిక జీతాలు వస్తాయని చెప్పి విదేశాలకు పంపించే ఏజెంట్లు చేసే మోసాలు అన్నీ ఇన్నీ కాదనేది తెలిసిన విషయమే. వారు చేసే మోసాల వల్ల ఎంతో మంది దేశం కానీ దేశంలో  నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ఇలానే మోసపోయి రష్యా వెళ్లిన పలువురు రష్యా ఉక్రెయిన్ తో జరగుతున్న యుద్ధంలో మృత్యువాత పడుతున్నారు.

అత్యధిక వేతనాలు అని చెప్పి ఒక్కొక్కరికి రూ.3లక్షలు వరకూ తీసుకున్న ఏజెంట్లు.. రష్యా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగాలు అని చెప్పి పంపించిన విషయం ఇటీవల వెలుగులోకి వచ్చి తీవ్ర చర్చనీయాంశం అయింది. ఈ క్రమంలో రష్యాలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గత నెలలో ప్రస్తావించారు. ఈ విషయమై భారత విదేశాంగ శాఖకు లేఖ రాశారు.

దీనికి స్పందించిన భారత ప్రభుత్వం రష్యాతో నేరుగా మాట్లాడి పలువురిని భారత్ కు రప్పించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో సంచలన అంశం వెలుగులోకి వచ్చింది. రష్యా ప్రభుత్వమే మోసం చేస్తోంది అంట. తాజాగా విజిటింగ్ వీసా మీద రష్యా చూడటానికి వెళ్లిన వారిని ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్టు చేసి పదేళ్ల జైలు శిక్ష విధిస్తుంది.

ఆ తర్వాత ఈ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఏడాది పాటు రష్యా సైన్యంలో సహాయకారిగా పని చేయాలనే షరతు విధిస్తోంది. బలవంతంగా సైన్యంలో చేర్చి సహాయకారి పేరు చెప్పి నేరుగా యుద్ధంలోకి దింపుతోంది. హరియాణా, పంజాబ్ లకు చెందిన గగన్ దీప్ సింగ్, లవ్ ప్రీత్ సింగ్, నరైన్ సింగ్, హర్షకుమార్ , అభిషేక్ కుమార్ అనే 24 ఏళ్లలోపు యువకులు పర్యాటక వీసామీద రష్యా వెళ్లారు. వీళ్లని పోలీసులు అదుపులోకి తీసుకొని.. అరెస్టు చేసి సైన్యంలో చేరాలని ఒత్తిడి చేస్తున్నారు. ఈ విషయాన్ని వారు వీడియో సందేశం రూపంలో పంపించి తమను భారత్ కు రప్పించాలని విదేశాంగ శాఖను కోరుతున్నారు. దీంతో రష్యా చేస్తున్న మోసం వెలుగులోకి వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: