వైసీపీలోకి ముద్రగడ ఎంట్రీ.. జనసేనకు చెక్ పెట్టిన జగన్..!!

Divya
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల యుద్ధం ప్రస్తుతం తారస్థాయికి చేరుతోంది.. ముఖ్యంగా గోదావరి రాజకీయం అందరిని ఆసక్తి కలిగించేలా చేస్తోంది.టిడిపి జనసేన పొత్తులో భాగంగా గోదావరి జిల్లాలో ఎక్కువ సీట్లు సాధించాలని లక్ష్యంగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.. ఇలాంటి విషయంలో వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా అలర్ట్ అయ్యి కాపు ఉద్యమ నేత ముద్రగడతో మంత్రంగం నడుపుతున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ తన కుటుంబ సభ్యులతో వైసిపిలో చేరేందుకు కూడా దాదాపుగా నిర్ణయించబడిందని వార్తలు వినిపిస్తున్నాయి.. జనసేన టార్గెట్ గా వైసీపీ ఆపరేషన్ మొదలుపెట్టినట్లుగా సమాచారం.

గోదావరిలో టిడిపి జనసేన లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం ఎన్నో వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తోంది. ఇప్పటికే హరి రామ జోగయ్య కుమారుడు తమ పార్టీలో చేర్పించుకున్న వైసిపి ఇప్పుడు ఏకంగా ముద్రగడను లక్ష్యంగా పెట్టుకొని ముందుకు అడుగులు వేస్తున్నారు.. గతంలో కూడా వైసీపీలోకి ముద్రగడ జెరుతారని వార్తలు వినిపించాయి.. కానీ ముద్రగడ వైసిపి నేతల మధ్య సీట్ల విషయంలో ఇబ్బందులు రావడంతో స్పష్టత రాకపోయింది.. ఆ తర్వాత జనసేన పార్టీలోకి పవన్ కళ్యాణ్ స్వయంగా ఆహ్వానిస్తారని వార్తలు వినిపించాయి.. ఇటీవల సీట్లు ప్రకటించిన విషయంలో ముద్రగడ ఎమోషనల్ గా ఒక లేఖ రాశారు..
ఇంటికి వస్తానని చెప్పి రాకపోవడంతో ముద్రగడ జనసేనలోకి చేరాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది.. పవన్ కళ్యాణ్ తీరు పైన ముద్రగడ కాస్త అసంతృప్తితో ఉన్నారని.. ఇక ముద్రగడ జనసేనలో చేరడం లేదని క్లారిటీ వచ్చేసింది..దీంతో వైసిపి నేతలు ముద్రగడకు టచ్లోకి వెళ్లారు ఆయన కుమారుడితో కూడా పలు రకాల చర్చలు జరుపుతున్నారు.. ఈ సమయంలోనే ముద్రగడ ఎలాంటి షరతులు లేకుండా వైసిపి పార్టీకి మద్దతు ఇవ్వడానికి అంగీకరించినట్టు సమాచారం.. అయితే మరి వైసీపీ నుంచి ముద్రగడ పోటీ చేస్తారా అనే విషయం ఇంకా తెలియలేదు కానీ పవన్ కళ్యాణ్ పైన బరిలో దింపే విధంగా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. మరి పూర్తి సమాచారం కావాలంటే మరొక కొద్ది రోజులు ఆగాల్సింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: