Ap:ముద్రగడ- జోగయ్య.. చాలా క్లియర్ గా ఉన్నారా..!!

Divya
ఆంధ్రప్రదేశ్లో వైసిపి పార్టీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ కూడగట్టుకొని ఈసారి ఎన్నికలలో పోరాడతామంటూ గడిచిన మూడేళ్ల క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు.. అయితే అందుకు తగ్గట్టుగానే బిజెపితో ఉంటూ టీడీపీతో కూడా పొత్తు పెట్టుకున్నారు.. అయితే ఈసారి రెండు పార్టీలను కలుపుకొని ఎన్నికలలో పోటీ చేయడానికి పలు రకాల ప్రయత్నాలు అయితే చేస్తున్నారు.. ఈ పొత్తుల భాగంగా జనసేన సీట్ల వ్యవహారంలో కాపు నేతలు అయినటువంటి ముద్రగడ పద్మనాభం, హరి రామ జోగయ్య నిత్యం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ ఉన్నారు.

కాపుల పేరుతో వీరు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేయడంలో తప్పు లేకపోయినప్పటికీ ఇప్పుడు వీరి వారసులు మాత్రం వైసీపీ పార్టీలో చేరడంతో పలు రకాల అనుమానాలు మొదలవుతున్నాయి.. నిన్న మొన్నటి వరకు హరి రామ జోగయ్య టిడిపి తో పొత్తు పెట్టుకున్న అధికారంలో భాగం కావాలని జనసేన పార్టీ పైన ఒత్తిడి తెచ్చారు ఆ తర్వాత అభ్యర్థుల ప్రకటన రావడంతో 24 సీట్లు కేటాయించడంతో ఫైర్ అయ్యారు.. ఒకసారి పవన్ కళ్యాణ్ తో కలిసి టీడీపీ ముందు పెట్టాల్సిన డిమాండ్లను కూడా తెలియజేశారు అయితే చివరికి అవి కాస్త నెరవేరకపోవడంతో జోగయ్య మీ కర్మకే వదిలేస్తున్నానంటూ వెల్లడించారు. ఆ తర్వాత పవన్ పార్టీలో ఉన్న తన కుమారుడు సూర్యప్రకాష్ వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు.

ఆ తర్వాత ముద్రగడ కూడా వైసీపీలోకి చేరేందుకు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తున్నారని తాను కోరిన సీట్లు ఇస్తే ఓకే అంటున్నారని వార్తలు అయితే వినిపిస్తున్నాయి. వైసిపి ఇన్చార్జర్ ప్రకటన తర్వాత ఈ విషయం కాస్త సైలెంట్ అయింది అందుకు కారణం ముద్రగడ కోరిన సీట్లు ఇవ్వకపోవడమే అన్నట్టుగా తెలుస్తోంది.. దీంతో పవన్ వైపు కాస్త మొగ్గుచూపి లేఖలు రాసినప్పటికీ పవన్ తన దగ్గరికి వస్తారని రాకపోవడంతో విసిగిపోయారని చివరికి వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారని ఆయన కుమారుడు చల్లారావు భవిష్యత్తు కోసమే పిఠాపురం సీట్ల పైన సంప్రదింపులు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాపు నేతలు అయినప్పటికీ వీరు వైసీపీలోకి నేరుగా చేరకుండా తమ వారసులని పంపిస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే వచ్చేది వైసిపి అధికారమేనని ఈ కాపు నేతలు క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: