బాబాయ్ కు షాకిచ్చిన అబ్బాయి.. దిక్కుతోచని స్థితిలో దేవినేని ఉమా!

Anilkumar
ఈసారి ఏపీ ఎలక్షన్స్ హోరాహోరీగా జరగబోతున్నాయి. త్వరలోనే ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో పలువురు కీలక నేతలు ఒక పార్టీ నుంచి మరొక పార్టీలోకి వలసలు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మైలవరం ఎమ్మెల్యేగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వసంత కృష్ణ ప్రసాద్ చంద్రబాబు హయామంలో ఇటీవల తెలుగుదేశం పార్టీలోకి చేరిన సంగతి మనకు తెలిసిందే. ఇలా ఈయన తెలుగుదేశం పార్టీలోకి చేరడంతో ఒక్కసారిగా తెలుగుదేశం రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి.

ఈ విధంగా వసంత కృష్ణ ప్రసాద్ టిడిపి పార్టీ తీర్థం పుచ్చుకోవడంతో మైలవరం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిగా ఉన్నటువంటి దేవినేని ఉమా పెనమలూరు వెళ్తారు అంటూ వార్తలు వచ్చాయి.
అయితే తాజాగా పెనమలూరు అభ్యర్థిగా దేవినేని కుటుంబం నుంచి మరొకరు పోటీకి రావడంతో తెలుగుదేశం నేతలు అయోమయంలో పడ్డారు.పెనమలూరు ఇన్చార్జిగా దేవినేని ఉమామహేశ్వర రావు కొనసాగుతారని అందరూ భావిస్తున్నటువంటి తరుణంలో దేవినేని కుటుంబం నుంచి మరొక కీలక అభ్యర్థి పెనమలూరు ఇన్చార్జిగా వ్యవహరించబోతున్నారని వార్త వెలుగులోకి వచ్చింది. దేవినేనికి స్వయానా కుమారుడు వరస అవుతున్నటువంటి దేవినేని చంద్రశేఖర్ పేరు తెరపైకి వచ్చింది.

ఈయన లోకేష్ పాదయాత్ర సమయంలో ఎంతగానో పార్టీకి ప్రయోజనకరంగా మారారు. ఈయన వివాదరహితుడు ఆర్థిక బలం ఉన్న నేత. ఇక ఈయన నారా లోకేష్ కు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి కావడంతో ఈయనకు కలిసి వచ్చే అంశాలుగా మారాయని చెప్పాలి. రాబోయే 30 ఏళ్ల సమీకరణాలను దృష్టిలో పెట్టుకొని యువతకు 40 శాతం టికెట్లు ఇవ్వాలనే దిశగా చంద్రబాబు నాయుడు, లోకేష్ ఉన్నట్టు తెలుస్తుంది. మరి పెనుమలూరులో ప్రస్తుతం బాబాయ్ వర్సెస్ అబ్బాయి అనేలా రాజకీయాలు జరుగుతున్నాయి. మరి ఈ ఇద్దరిలో పెనమలూరు టిక్కెట్ ఎవరికి వస్తుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఇక్కడ ఎవరు టికెట్ అందుకుంటారు తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: