ఎన్నికలలో పోటీ చేసే వారికి ఇంటర్వ్యూ తో సెలెక్ట్ చేస్తున్న షర్మిల..!!

Divya
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు అన్ని పార్టీలు సైతం తమ తమ వ్యూహాత్మక సిద్ధాంతాలతో ముందుకు వెళుతున్నాయి..ఇప్పటికే అభ్యర్థులను ప్రకటిస్తూ వైసిపీ,టిడిపి, జనసేన పార్టీలు వెళుతూ ఉంటే ఎన్నికలు పోరాటానికి తాము కూడా సిద్ధమేనంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిల బాధ్యతలను తీసుకుంది. దీంతో కాంగ్రెస్కు మళ్ళీ తిరిగి ప్రాణం పోసినట్టుగా అనిపించింది.. ఈసారి జరగబోతున్న ఎన్నికలపై చాలా ఆశలతోనే ముందుకు వెళ్తున్నారు కాంగ్రెస్ పార్టీ.. అన్ని పార్టీలు కూడా గెలుపు గుర్రాలకి టికెట్లు ఇవ్వాలని పక్కా ప్రణాళికలతోనే ముందుకు వెళ్తున్నారు..

అభ్యర్థుల ఎంపిక బాధ్యతను వైయస్ షర్మిలనే డైరెక్ట్ గా తీసుకొని ఎన్నికలకు వైసీపీ టిడిపి జనసేన కూటమి సర్వేల ఆధారంగా ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి అభ్యర్థులను వారి స్థితిగతుల ఆధారంగానే టికెట్లు కేటాయింపు విషయంలో పలు రకాల నిర్ణయాలు తీసుకున్నారు..అయితే ఈసారి షర్మిల టికెట్ల కేటాయింపులు కొత్త విధానాన్ని అవలంబించబోతోంది. పక్క కార్పొరేట్ స్టైల్లో వైయస్ షర్మిల ఇంటర్వ్యూలను నిర్వహిస్తూ ఎంపీ ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయింపు విషయంలో చాలా నిర్ణయాలు తీసుకోవడంతో రాజకీయాలలో ఈ విషయం ఆసక్తిని కలిగిస్తుంది.

ఇప్పటికే వివిధ నియోజకవర్గాలలో నుంచి దరఖాస్తులు స్వీకరించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఇంటర్వ్యూ కూడా చేస్తున్నారట.. ఆంధ్ర రత్న భగవాన్ వేదికగా మొదలైన ఈ ఇంటర్వ్యూలు నిన్న ఈరోజుతో కూడా ముందుకు కొనసాగుతున్నాయి.. నిన్నటి రోజున మచిలీపట్నం ఏలూరు బాపట్ల గుంటూరు నరసాపురం ఇతరత్రా లోక్సభ స్థానాలలో అసెంబ్లీ నియోజకవర్గాల టికెట్లను ఆశీర్వదిస్తున్న వారందరినీ షర్మిల ఇంటర్వ్యూ చేసింది.. 67 మంది అసెంబ్లీ నియోజకవర్గాల వారితో వైఎస్ షర్మిల నేరుగా మాట్లాడినట్లు తెలుస్తోంది.. వీరిలో ప్రజలకు ఉన్న మంచి పేరు అభ్యర్థుల గుణ గుణాలను పరిగణించి పార్టీకు ఉన్న కమిట్మెంట్ ఇలా అన్ని అంశాలను పరిగణంలోకి తీసుకొని వైయస్ షర్మిల కాంగ్రెస్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: