ఎర్రబుక్ వల్ల ఇబ్బందులలో నారా లోకేష్..!!

Divya
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ ఎక్కడ ప్రచారానికి వెళ్లిన రెడ్ బుక్ తీసుకొని చాలా మంది బెదిరిస్తున్నారని పలువురు ఆఫీసర్లు సైతం తెలియజేస్తున్నారు. దీంతో ఏసీబీ కోర్టులో లోకేష్ ఈ రెడ్ బుక్ పైన బెదిరింపుల కేసుతో విచారణ చేస్తున్నారు.. అయితే అందుకు కౌంటర్లు దాఖలు చేయడానికి టీడీపీ లాయర్లు మళ్ళీ కాస్త సమయాన్ని కోరినట్లు తెలుస్తోంది. దీంతో మార్చి 11 కి ఈ విచారణ వాయిదా వేశారట. గత రెండు నెలలుగా ఏసీబీ కోర్టులో వాయిదా వేస్తూనే ఉన్నారు టిడిపి న్యాయవాదులు.

అయితే ఈ కేసు జరగకుండా నారా లోకేష్ మొదటి నుంచి పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే అందుకు తగ్గట్టుగా కౌంటర్ దాఖలు చేయాలని స్వయంగా ఏసీబీ కోర్టు పలు రకాల ఆదేశాలను జారీ చేసినప్పటికీ లోకేష్ వాటిని అసలు పట్టించుకోలేదు.. యువ గళం ముగింపు రోజున మీడియా ఛానల్స్ ఇంటర్వ్యూలలో లోకేష్ పలు రకాల వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారట.. తన తండ్రి పైన తప్పుడు కేసులు పెట్టారని రిమాండ్ విధించడం తప్పంటూ..ACB న్యాయమూర్తి పైన చాలా దురుద్దేశం గానే వ్యాఖ్యలు చేశారు.

దీంతో అధికారులపై రెడ్ బుక్ లో తమ పేర్లను రాసుకున్నానంటూ బెదిరింపులు చేస్తున్నారు.. దీంతో ఏసిపి అది కారులు కోర్టులో ఈ బుక్ విషయం బెదిరింపుల పైన రెండు నెలల క్రితం సిఐడి పిటిషన్ కూడా దాఖలు చేశారు.. కౌంటర్ దాఖలు చేస్తే అడ్డంగా దొరికిపోతారని భయంతో లోకేష్ వాయిదాలతో నెమ్మదిగా వీటిని నెట్టుకొస్తూ ఉన్నారు.. దీంతో నిన్నటి రోజున విచారణతో మరొకసారి టిడిపి లాయర్లు వాయిదా కోరడం జరిగింది.. మరి లోకేష్ వీటిపైన ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని రాజకీయాలు కూడా రోజురోజుకి వాడి వేడిగా ముందుకు వెళుతున్నాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసిపి ప్రతిపక్షంలో ఉన్న టిడిపి పార్టీలో ఇంకా మెనిఫెస్టోను విడుదల చేయలేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: