టీడీపీ అసంతృప్తులు.. జగన్ మీడియా పండగ?

Chakravarthi Kalyan
టీడీపీ నేతలపై ఒక్కసారిగా వైసీపీ అనుకూల మీడియా సానుభూతి కనబరుస్తోంది. ఇప్పటి వరకు పార్టీని నమ్ముకున్న నేతలకు టీడీపీ అధినేత టికెట్లు నిరాకరించడంతో కొంతమంది సీనియర్లు విస్మయానికి గురయ్యారు. దీంతో పార్టీ ని నమ్ముకున్న నేతలకు చంద్రబాబు ద్రోహం చేస్తున్నారంటూ బ్యానర్ల కొద్దీ కథనాలు ప్రచురించింది.

రాష్ట్ర వ్యాప్తంగా పారాచూట్ నేతలతో టీడీపీలో భగభగలు అంటూ వార్త రాసుకొచ్చింది. రాజకీయాలతో సంబంధం లేకుండా ఎక్కడి నుంచో ఉన్నట్టుండి నియోజకవర్గాల్లో దిగిన వారితో స్థానిక నేతలు, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్న వారికి ఏ మాత్రం పొసగడం లేదు. పైగా పారాచూట్ నేతలకు ధనబలం, హంగు ఆర్భాటాలకే చంద్రబాబు ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. పార్టీ కోసం తాము పడ్డ కష్టాలు, చేసిన పనులను మరిచి ఇప్పుడు బయటి వారిని తీసుకురావడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు.

చంద్రబాబు మాత్రం వాటిని ఖాతరు చేయకుండా డబ్బున్న వారినే తన వద్దకు రావాలని స్పష్టం చేస్తున్నారు. కాకినాడ ఎంపీ రేసులోకి వ్యాపార వేత్త సానా సతీశ్ దూసుకువచ్చారు. టీడీపీ, జనసేన ఏదో ఒక దాని నుంచి పోటీకి సిద్ధం అవుతున్నారు. దీంతో జ్యోతుల నెహ్రూకి మింగుడు పడటం లేదు. తుని నియోజక వర్గ ఇన్ఛార్జిగా యనమల రామకృష్ణుడి కుమార్తె దివ్యను ప్రకటించారు. దీంతో అతని సోదరుడు కృష్ణుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.

ఏలూరి పార్లమెంట్ సీటు కోసం ఎన్ఆర్ ఐ గోరుముచ్చు గోపాల్ యాదవ్ ముందుకు రావడంతో మాగంటి బాబు ఆందోళనకు గురవుతున్నారు. గుడివాడ ఇన్ఛార్జి గా వెనిగళ్ల రాముని రాముని నియమించడంతో పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న రావి వెంకటేశ్వరరావు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇదంతా బాగానే ఉన్నా.. వైసీపీలో టికెట్లు ప్రకటించిన సమయంలో అసమ్మతిని ఎందుకు ప్రస్తావించలేదో అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పార్టీ నుంచి నలుగురు ఎంపీలు బయటకి వెళ్లినా వాళ్ల గురించి ఎటువంటి వార్తలు రాయలేదు. మరోవైపు టీడీపీ అనుకూల మీడియా కూడా వైసీపీ వ్యతిరేక వార్తలను భూతద్ధంలో పెట్టి చూపిస్తున్నాయి. ఇది జర్నలిజానికి మంచిది కాదని విశ్లేషకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: