ఈసారి ఎన్నికలలో టిడిపి కూటమితో గెలిచే అవకాశమే లేదు.. జనసేన సీనియర్ నేత..!!

Divya
రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు త్వరలోనే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం జనసేన మధ్య ఎట్టకేలకు నిన్నటి రోజున సీట్ల పంపకాల వ్యవహారం తేల్చేశారు..118 మంది అభ్యర్థులతో కూడిన అభ్యర్థుల మొదటి జాబితాను చంద్రబాబు నాయుడు , జనసేన పార్టీ నేత పవన్ కళ్యాణ్ విడుదల చేయడం జరిగింది. ఇందులో 94 నియోజవర్గాలలో టిడిపి పార్టీ పోటీ చేయగా 24 నియోజకవర్గాలలో జనసేన అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో కొంతమంది ప్రముఖుల పేర్లు అయితే ఉన్నాయి.
అయితే తమ పార్టీ 24 అసెంబ్లీ మూడు లోక్సభ స్థానాలు మాత్రమే ఇవ్వడం పట్ల జనసేన కేడర్ ఒక్కసారిగా ఫైర్ అయినట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల పార్టీ నాయకులు రాజీనామా చేస్తూ ఉండగా తెలుగుదేశం పార్టీ జెండాలను కూడా తగలేస్తూ ఉన్నారు. నారా లోకేష్ ను ముఖ్యమంత్రిని చేయడానికి చంద్రబాబు ఆడిన ఒక్క నాటకం అంటూ చాలామంది విస్మరిస్తూ ఉన్నారు.. తాజాగా ఈ పరిణామాల పైన జనసేన పార్టీ సీనియర్ నేత.. బొల్లి శెట్టి సత్యనారాయణ  మాట్లాడుతూ జనసేన పార్టీకి గౌరవప్రదమైన సీతను కేటాయిస్తే బాగుంటుందని తేల్చి చెప్పారు లేకపోతే ఈసారి ఎన్నికలలో టిడిపి కూటమితో గెలిచే అవకాశం లేదంటూ కూడా క్లారిటీ ఇచ్చారు.

జనసేన అభ్యర్థులు లేని నియోజకవర్గం ఓట్లు బదిలీ కావాలి అంటే సీట్లను పెంచక తప్పదు అంటూ కూడా హెచ్చరిస్తున్నారు. సీట్ల విషయంలో చంద్రబాబు దిగి రావాలని జనసేనకు కనీసం 40 సీట్లను ఇవ్వాలంటూ లేకపోతే కూటమి కూలిపోతుందంటూ కనీసం 40 సీట్లన్న ఇవ్వకపోతే కాపుల నుంచి ఓట్లు టిడిపి ఎట్టి పరిస్థితులలో వేయరు అంటూ కూడా తెలియజేశారు.. సీట్ల విషయంలో జనసేన సైనికుల సైతం తీవ్రఆసం తృప్తిలో ఉన్నారంటూ కూడా తెలియజేశారు బోల్లి శెట్టి సత్యనారాయణ.. మరి సీట్ల విషయం పైన మరొకసారి అటు టిడిపి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: