షర్మిళ సాక్షి సంస్థలో సగం వాటా ఇప్పుడెందుకు అడుగుతున్నట్టు?

Purushottham Vinay
ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతల్ని తీసుకున్న షర్మిల తన అన్న పైనా ఇంకా అలాగే ఆయన ప్రభుత్వం మీద విమర్శలతో విరుచుకుపడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆమె సాక్షి సంస్థలో తనకు సగం వాటా ఉందన్న విషయాన్ని ప్రస్తావించి కొత్త చర్చకు తెర తీశారు.ఆమెకు సగం వాటా ఉన్న సంస్థనే తన మీద విమర్శలు చేస్తూ బురద జల్లుతుందన్న వాదనను వినిపిస్తున్న షర్మిలకు నిజంగానే వాటా ఉందా? ఉంటే.. అందులో నిజమెంత? చట్టబద్ధంగా.. న్యాయబద్ధంగా ఆమెకు సాక్షిలో భాగస్వామ్యం ఉందా? అనే విషయం ఇప్పుడు ప్రశ్నగా మారింది.సాక్షిలో ఆమెకు సగం వాటా ఉందన్న షర్మిల.. ఈ విషయం మీద ఏం చెప్పారంటే... ''ఆస్తిలో జగన్ కు.. నాకు సమాన భాగం ఉండాలని తండ్రి వైఎస్సార్ గారు నిర్ణయించారు. తెలంగాణ రాష్ట్రంలో నాతో కలిసి పని చేసిన వాళ్లకు సాక్షి సంస్థ నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఇక నా గురించి వ్యతిరేకంగా మాట్లాడాలని అడుగుతున్నారు. వీటి అన్నింటికి కాలమే సమాధానం చెబుతుంది. 

అన్ని కథలని చూస్తా. వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి 3200కి.మీ. పాదయాత్ర చేశా. నిజాల్ని మరిచి సాక్షి పత్రిక ఇష్టం వచ్చినట్లు వార్తలు రాస్తోంది. వైసీపీ నేతలు ఏం చేసినా.. సాక్షి పత్రిక ఏం రాసినా నేనసలు భయపడే ప్రసక్తే లేదు. అస్సలు వెనక్కి తగ్గేదీ లేదు. సాక్షి సంస్థలో నాకు కూడా సగం వాటా ఉంది'' అని కామెంట్స్ చేశారు.షర్మిల మాటల్ని జాగ్రత్తగా పరిశీలిస్తే.. పూర్తి విషయం అర్థమవుతుంది. సాంకేతికంగా ఆమెకు సాక్షి సంస్థలో ఎలాంటి హక్కు లేదనే విషయం అర్థమవుతుంది. ఇక తన తండ్రి ఆస్తిలో సగాన్ని తనకు ఇవ్వాలని కోరారని.. ఆ అభిలాషను చెప్పిన షర్మిల ఇక్కడ ఒక విషయాన్ని మిస్ అయ్యారు.  ఇప్పుడు దాకా రాని వాటా వ్యవహారం ఇప్పుడే ఎందుకు వచ్చినట్లు? అన్నది ప్రశ్న.
సాక్షిలో సగం వాటా అనేది మాట్లాడుకోవటానికి పనికి వస్తుందే తప్పించి..ఆమెకు ఎలాంటి అధికారిక హక్కు లేదనేది మర్చిపోకూడదు.సాక్షి సంస్థ పెట్టిన మొదట్నించి చూస్తే.. ఒక్క రోజు అంటే ఒక్క రోజు కూడా ఆ మీడియా సంస్థకు వెళ్లి.. దాని రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొన్నది లేదు. అలాంటప్పుడు ఇప్పుడు సగం వాటా ఉందన్న మాటలో అర్థం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటువంటి కామెంట్స్ తో తనను తాను చులకన చేసుకునే కన్నా..కొంచెం జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: