అధికారంలో ఉన్నప్పుడు ఏమైంది బాబూ?

Chakravarthi Kalyan
రా కదిలిరా.. సిద్ధం ఇలా రకరకాల పేర్లతో టీడీపీ, వైసీపీలు ఎన్నికల కథనరంగంలోకి దిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా స్పీడ్ పెంచాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించకుండానే ప్రజా క్షేత్రంలోకి వెళ్లిపోయాయి. ప్రజలను ఆకట్టుకోవడానికి బహిరంగ సభలు, కీలక సమావేశాలు నిర్వహిస్తూ ఆయా పార్టీల నాయకులు జనాల బాట పడుతున్నారు.

ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రా కదిలి రా పేరిట పీలేరులో నిర్వహించిన సభలో సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు. ప్రజా కోర్టులో  జగన్ కు శిక్ష పడే సమయం ఆసన్నమైందని, వైసీపీకి కౌంట్ డౌన్ మొదలైందని అన్నారు. రాబోయే కురుక్షేత్ర యుద్ధంలో జరిగేది గెలిచేది టీడీపీ, జనసేన కూటమేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఇక భీమిలిలో నిర్వహించిన సభపై కూడా చంద్రబాబు స్పందించారు. అవినీతి డబ్బుతో ఎన్నికల సభల కోసం పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెడుతున్నారని మండిపడ్డారు. జగన్ ను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారనారు.

జగన్ కు అభ్యర్థులు కూడా దొరకడం లేదని.. పులివెందులలో కూడా జగన్ ఓడిపోతారని జోస్యం చెప్పారు. జగన్ అధికార అహంకారాన్ని దించడానికి ప్రభుత్వ ఉద్యోగులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఎన్నికల అనంతరం వైసీపీ జెండా పీకేయడం ఖాయమన్నారు. అభివృద్ధి, ప్రాజెక్టులు, పరిశ్రమలు లేవని మండిపడ్దారు.

నేను రాయలసీమ బిడ్డనే అని.. నాలో ఉన్నది రాయలసీమ రక్తమేనన్నారు. రాయలసీమను రతనాల సీమను చేసేందకు ఎన్నో ఆలోచనలు చేశాను. జగన్ సీమ కోసం ఏం చేశారో చెప్పాలి అని ప్రశ్నించారు.  పీలేరు, పుంగనూరు, మదనపల్లి, తంగెళ్లపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామని.. హంద్రీనీవా కాలువ పనులు పూర్తి చేసి చెరువులకు నీళ్లు ఇస్తాం.. ఏపీఐఐసీ ద్వారా సేకరించిన 2500 ఎకరాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. మదనపల్లిలో టమాటా ప్రాసెంట్ యూనిట్ ను ఏర్పాటు చేస్తాం. రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. కాగా గతంలో 20 ఏళ్లు అధికారంలో ఉన్న సమయంలో ఇవన్నీ ఎందుకు పూర్తి చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇన్నేళ్లు చేయలేదని.. ఇప్పుడు ఎలా చేస్తారని అడుగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: