తెలంగాణ: గాలి బీజేపీకి మళ్లుతోందా?

Chakravarthi Kalyan
తెలంగాణలో బీజేపీ మైండ్ గేమ్ మొదలు పెట్టిందా అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. పక్కా ప్లాన్ తో ఎన్నికలకు వెళుతున్నారు. పార్టీలో అంతర్గత కలహాలు, బండి సంజయ్ ను తీసేయడం, ఈటలను పెట్టడం, సింగిల్ డిజిట్ కు పరిమితం అవుతామని కొన్ని రోజులు కొంతమంది తో సోషల్ మీడియాలో వైరల్ చేయించడం అంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగినట్లే తెలుస్తుంది. ముఖ్యంగా టికెట్ల విషయంలో చివరి రోజు వరకు ఆగడం, తర్వాత మైండ్ గేమ్ మొదలెట్టారు.


మొన్నటి వరకు సింగిల్ డిజిట్ సీట్లు వస్తాయని ప్రచారం చేసిన కొంతమందికి తర్వాత డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గెలిస్తే వారు అందులో ఉండరని చివరకు మళ్లీ కేసీఆర్ పాదాల దగ్గరకే వెళతారని ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు కాంగ్రెస్ , బీఆర్ ఎస్ గా ఉన్న పోరు కాస్త త్రిముఖ పోరుగా మారిందని చెబుతున్నారు. ముఖ్యంగా 30 స్థానాల్లో బలంగా ఉన్నామని చెప్పుుకుంటున్నారు.


తద్వారా బీజేపీ తన మైండ్ గేమ్ పక్కాగా అమలు చేస్తుంది. దాదాపు 30 నుంచి 40 స్థానాల్లో చాలా బలమైన నాయకులను పోటీ లో నిలబెట్టింది. అందులోభాగంగా ఎక్కడా కూడా తగ్గకుండా పని చేస్తుంది. మోదీ, అమిత్ షా లాంటి హేమ హేమీలతో ప్రచారం చేయిస్తుంది. తద్వారా ప్రజల్లోకి తన మేనిఫేస్టో హామీలను తీసుకెళుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నేతలు నిలుచున్న ప్రాంతాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తుంది.


బీసీ ముఖ్యమంత్రి హామీ , మాదిగ రిజర్వేషన్లు ప్రధాన అంశంగా ఎన్నికల్లో ప్రచారం చేయిస్తుంది. మరి ఇలాంటి సమయంలో బీజేపీ అమలు చేస్తున్న విధానంతో ఎన్నిసీట్ల వరకు గెలవచ్చు. ఎంతమందికి బీజేపీ వల్ల ఓడిపోయే అవకాశం ఉంది. బీజేపీ దాదాపు 30 స్థానాల్లో గెలిస్తే రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితి ఉంటుంది. ఇలా ఎన్నో ప్రశ్నలకు డిసెంబర్ 3 తర్వాతే సమాధానం దొరికే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: